Srikaram News
తెలంగాణరాజకీయం

బీజేపీలో ముసలం

# ప్రత్యామ్నాయం వైపు రాథోడ్ రమేష్ చూపు

# అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తి

#పార్టీ మారుదామంటూ అనుచరగణం ఒత్తిడి

# కీలక నేతలతో సమాలోచనలు

బైంసా, (శ్రీకరం న్యూస్): పార్టీ టికెట్ కేటాయింపుపై నిర్మల్ జిల్లా బీజేపీలో ముసలం మొదలయ్యింది. టికెట్ కోసం ఆశలు పెట్టుకున్న పార్టీ నేత రాథోడ్ రమేష్ కు అధిష్టానం మొండి చేయి చూపింది. దీంతో తీవ్ర అసంతృప్తి చెందిన ఆయన ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించినట్లుగా తెలిసింది. టికేట్ కేటాయింపు ప్రక్రియలో అన్యాయం చేసిన పార్టీని వదిలి ఇతర పార్టీలోకి మారుదామంటూ ఆన చరగణం ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకవస్తున్నట్లుగా తెలిసింది. ఇందులో భాగంగానే గురువారం హైదరాబాద్ లో రాథోడ్ రమేష్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలతో సంబంధిత విషయంలో స మాలోచనలు జరిపినట్లుగా సమాచారం, జిల్లాలోని నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజక వర్గ ప్రాంతాలకు చెందిన పార్టీ ప్రధాన నేతలు సైతం రాతోడ్ రమేష్ వెన్నంటే పయనించేందుకు సిద్ధమవు తున్నట్లుగా తెలిసింది.

• ఆధిష్టానం వైఖరి పై తీవ్ర వ్యతిరేకత

మాజీ ఎంపీ గెడం నగేష్ కు అధిష్టానం టికెట్ కేటాయించడం పై జిల్లా బీజేపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బుదవారం పార్టీ మాజీ రాష్ట్ర కార్యవర సభ్యులు బాలాజీ సూత్రావేతో పాటు ము దోల్ లోని పలువురు పార్టీ ప్రతినిధులు గెడం నగేష్ కు టికెట్ కేటాయించరాదంటూ నిరసన ప్రదర్శనలు చేపట్టి ఆందోళనలు వ్యక్తం చేశారు. జిల్లాలోని మూడు నియోజక వర్గాల పరిధిలో సంబంధిత వి షయంలో నిరసన వ్యక్తమయ్యింది. దీనికి తోడు రాథోడ్ రమేష్ కు టికేట్ వస్తుందనే ఆశతోనున్న ఆయన అనుచరగణం అధిష్టానం నిర్ణయంతో ఖంగుతిన్నారు. రాథోడ్ రమేష్ కు టికెట్ కేటాయించాలం టూ రెండు రోజుల క్రితం జిల్లాలోని మూడు నియోజక వర్గాలకు చెందిన పలువురు కీలక నేతలు న్యూఢిల్లీలో పార్టీ పెద్దలను నేరుగా కలిసి విన్నవించారు. అయినప్పటికి ప్రయోజనం లేకుండా పోయి0ది ఆదిష్టానం టికేట్ కేటాయింపు ప్రక్రియలో ఏక పక్షంగా వ్యవహరించిందని జిల్లాలోని పలువురు పార్టీ కీలక నేతలు బహిరంగంగానే విమర్శించారు. వీందరరూ అదిష్టానం తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

• ప్రత్యామ్నాయం వైపు రాథోడ్ రమేష్ దృష్టి …

చివరి వరకు టికెట్ తనకు దక్కుతుందన్న పూర్తి నమ్మకంతోనున్న రాథోడ్ రమేష్ ఆధిష్ఠానం నిర్ణయంతో తీవ్ర అసంతృప్తి చెంది ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించినట్లుగా తెలిసింది. బుధవారం గే డం నగేష్ కు టికెట్ ప్రకటించిన సమయంలో కరీంనగర్ లో నున్న రాథోడ్ రమేష్ అక్కడి నుంచి హైదరాబాదకు వెళ్లిపోయారు. గురువారం నిర్మల్ ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాలకు చెందిన పలువురు పార్టీ నేతలు రాథోడ్ రమెష్ ను కలిసేందుకు హైదరాబాద్ కు తరలి వెళ్లారు. వారందరూ పార్టీ మారుద్దామంటూ రాథోడ్ రమేష్ పై ఒత్తిడి తీసుకవచ్చినట్లుగా తెలిసింది. ఇందులో భాగంగానే కీలక నేతలతో రాదోడ్ సమాలోచనలు జరిపినట్లుగా తెలిసింది. వారందరి సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకొని భవిష్యత్ కార్యచరణ ప్రణాళిక రూపొందించుకోనున్నట్లు తెలిసింది.

• రాథోడ్ పార్టీ మారితే బీజేపీకి కోలుకోలేని దెబ్బ…
ఎమ్మెల్యేగా, జిల్లా పరిషద్ ఛైర్మెన్ గా, పార్లమెంట్ సభ్యునిగా జిల్లాలోని మూడు నియోజక వర్గాల ప్రజలతో రాథోడ్ రమేష్ కు సత్ససంబంధాలు ఉన్నాయి. ఇతర పార్టీల్లోనూ ఆయనకు కొంత మేర అభిమానులు ఉన్నారు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అనుచరగణం కలిగిన రాథోడ్ ఎన్నికల వేళ పార్టీ మారితే బీజేపీ నష్టం వాటిల్లే పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఇప్పటికే మూడు నియోజక వర్గాల్లోని ఆయన అనుచరగణం ఆధిష్టానం వైఖరితో రగిలిపోతున్నారు .టికేట్ కేటాయించకుండా ఆన్యాయం చేసిన పార్టీకి గుణపాఠం నేర్చుదామని పలువురు అనుచరులు ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకవస్తున్నట్లుగా తెలుసింది

0Shares

Related posts

కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ సోయం బాపురావ్

Srikaram News

నిర్మల్ కుండపోత వర్షం

Srikaram News

మాజీ డీసీసీ అధ్యక్షుడు దిగంబర్ మాశెట్టివార్ కన్నుమూత

Srikaram News

భైంసా వాసికి రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్సలెన్స్ 2024 అవార్డు

Srikaram News

సభ్యత్వ నమోదులో శభాష్..!

Srikaram News

తేనెటీగల దాడిలో 8 మంది రైతులకు అస్వస్థత

Srikaram News

Leave a Comment