– అభరణాలను ఎత్తుకెళ్లిన దొంగలు
– ఘటన స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ అవినాష్ కుమార్, సీఐ గోపినాథ్. భైంసా (శ్రీకరం న్యూస్) : రెవెన్యూ డివిజన్ కేంద్రమైన భైంసాలోని ప్రసిద్ధ నర్సింహా స్వామి ఆలయంలో ఆదివారం వేకువ జామున దొంగతనం జరిగింది. ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు స్వామి వారి గర్భగుడి ప్రవేశ మార్గానికి గల తాళాలను పగులగొట్టి లోనికి వెళ్లి చోరికి పాల్పడ్డారు. నర్సింహా స్వామికి అలంకరించిన 3.5 కిలోల వెండి మకర తోరణంతో పాటు 29 తులాల కిరీటాన్ని దొంగలు అపహరించుకుపోయారు. అంతే కాకుండా గర్భగుడి ముందర గల హుండిని కింది భాగం నుంచి పగుల గొట్టి భక్తులు సమర్పించిన నగదును ఎత్తుకెళ్లిపోయారు. ఉదయం 9గంటల్ ప్రాంతంలో సంబంధిత చోరి ఘటన వెలుగు చూసింది. ఘటన స్థలాన్ని భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, టౌన్ సీఐ గోపినాథ్ లు పరిశీలించారు. ఆలయ పూజారులు, నిర్వాహాకులతో మాట్లాడి చోరి ఘటన వివరాలు తెలుసుకున్నారు.