– బంగారు పతకం సాధించి సత్తా చాటిన సీహెచ్ అరుషి
– వచ్చె నెల 2,3,4 తేదిల్లో సంగారెడ్డిలో రాష్ట్ర స్థాయి పోటీలు. బైంసా, (శ్రీకరం న్యూస్) : మండల కేంద్రమైన తానూర్ లోని వాగ్దేవి విద్యానికేతన్ కు చెందిన సీహెచ్ అరుషి అనే విద్యార్థిని రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైంది. శనివారం మంచిర్యాల్ జిల్లా సీసీసీ నస్పూర్ లో జరిగిన 68వ జోనల్ స్థాయి ఎస్ జిఎఫ్ కరాటే పోటీల్లో పాల్గొన్న సీహెచ్ అరుషి క్రీడా ప్రతిభ ను చాటుకొని బంగారు పతకం సాధించి రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ఎంపికయ్యింది. వచ్చే నెల 2,3,4వ తేదిలలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగనున్న 68వ రాష్ట్ర స్థాయి ఎస్ జి ఎఫ్ కరాటే క్రీడా పోటీలలో సీహెచ్ అరుషి పాల్గొ ననుంది. జోనల్ స్థాయి కరాటే పోటీల్లో భైంసా డివిజన్ నుంచి 5 గురు విద్యార్థులు పాల్గొనగా అందులో సీహెచ్ అరుషి బంగారు పతకం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవ్వగా మిగతా నలుగురిలో డి.రాజేశ్వరి, పి.చైతన్య, ఎల్.మమత, టి. అరవిందు లలో.. ఇద్దరు రజత, మరో ఇద్దరు కాంస్య పతకాలు సాధించారు. రాష్ట్ర స్థాయిలో పోటీలకు ఎంపికైన సీహెచ్ అరుషితో పాటు రజత, కాంస్య పతకాలు సాధించిన విద్యార్థులకు కరాటే కోచ్ రాజశ్రీ, శివరాజ్ గౌడ్ లు అభినందించి సత్కరించారు.

previous post