– అద్భుతమైన ప్రదర్శనతో జిల్లాలో ద్వితీయ స్థానం
– అభినందించి ప్రశంస పత్రాన్ని అందచేసిన డీఈవో రవీందర్ రెడ్డి బైంసా, (శ్రీకరం న్యూస్): జిల్లా కేంద్రమైన నిర్మల్ శనివారం జరిగిన జిల్లా స్థాయి కళా ఉత్సవ్ – 2024లో పాల్గొన్న భైంసాకు చెందిన నలుగురు విద్యార్థినీలు నాట్య ప్రదర్శనతో దుమ్మురేపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన 120 విద్యార్థి బృందాలు కళా ఉత్సవ్ లో తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించారు. సంప్రదాయ, జాన పద, సంగీత, వాయిద్య, నృత్య, చిత్రకళ, నాటిక, ఏకపాత్రభినంతో పాటు పలు వివిధ అంశాలల్లో పోటీలు జరిగాయి. ఇందులో బైంసా పట్టణంలోని శార్వాణీ సంగీత నృత్యానికేతన్ లో శిక్షకురాలు మియాపురం శ్రీవాణి సారధ్యంలో శిక్షణ పొందిన వశిష్ట జూనియర్ కళాశాలకు చెందిన సాప ధరణీశ్రీ. కె. సాత్విక, గుజ్జల్వార్ నిఖిత, వేదం తపోవన్ కు చెందిన సబ్బన్ వార్ రమ్యకృష్ణలు చేపట్టిన నృత్య ప్రదర్శన అందరిని మంత్రముగ్దులను చేసింది. అద్భుతమైన నాట్య ప్రదర్శనతో నలుగురు విద్యార్థులు అందరిచే మనలను పొంది జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారు. నిర్మల్ లోని టీఎస్ఆర్జె కళాశాల విద్యార్ధి బృందం మొదటి స్థానంలో నిలిచింది. అందరిచే ప్రశంసలు అందుకొని ద్వితీయ స్థానంలో నిలిచిన భైంసా విద్యార్థినీల బృందానికి జిల్లా డీఈవో రవీందర్ రెడ్డి అభినందించి ప్రశంస పత్రాలను అందజేశారు.