Srikaram News
క్రైమ్తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో స్వర్ణకార సంఘ జిల్లా మాజీ అధ్యక్షుడు కలికోట రాములుకు తీవ్ర గాయాలు

@ బైక్ పై వెలుతుండగా వెనుక నుంచి ఢీ కొట్టిన అర్టీసీ బస్సు
@ తల, భుజానికి తీవ్ర గాయాలు
@ ఏరియా ఆసుపత్రిలో చికిత్స

బైంసా, (శ్రీకరం న్యూస్): స్వర్ణకార సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు కలికోట రాములు (70) రోడ్డు ప్రమాదం బారిన పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. మంగళవారం ఉదయం వేళలో వ్యక్తిగత పనుల నిమిత్తం బైంసా నుంచి మాటేగామ్ వైపు బైక్ పై వెలుతుండగా ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మార్గంలోని ఎస్ఆర్ మోటార్స్ వైపు మరల తున్న కలికోట రాములు బైక్ ను వెనుక వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. బస్సు ఢీ కొట్టడంతో కలికోట రాములు బైక్ పై నుంచి కింద పడటంతో తల, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి ప్రాంత వాసులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని వైద్య సేవల నిమిత్తం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహింప చేశారు. ఆర్టీసీ బైంసా బస్సు డిపో అధికారులు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు కలికోట రాములును పరామర్శించి ప్రమాద ఘటన వివరాలు, కారణాలు అడిగి తెలుసుకున్నారు.

0Shares

Related posts

నర్సింహా స్వామి ఆలయంలో దొంగతనం

Srikaram News

నాగదేవత ఆలయంలో చోరికి పాల్పడ్డ దొంగల పట్టివేత

Srikaram News

శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో కొలువుదీరిన అమ్మవారు

Srikaram News

బాసర దుర్ఘటనలోని మృతుల్లో ముగ్గురు సొంత అన్నదమ్ములు

Srikaram News

కాంగ్రెస్ లో చేరిన ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

Srikaram News

రోడ్డు ప్రమాదంలో నిర్మల్ యువ ఫోటోగ్రాఫర్ మృత్యువాత

Srikaram News

Leave a Comment