*రోడ్లపైనే వంటావార్పు…సామూహిక భోజనాలు
భైంసా (శ్రీకరంన్యూస్) : ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ జాతీయ రహాదారి మార్గంలోని దిలావార్ పూర్ మండల కేంద్ర సమీపంలో ఆందోళనకారులు చేపట్టిన రాస్తారోఖో కొనసాగుతుంది. ఉదయం వేళ ప్రారంభం అయిన రాస్తారోఖో సాయంత్రం వేళలోను కొనసాగింది. వాహనాలను రాకపోకలను పూర్తి స్థాయిలో అడ్డగించిన ఆందోళనకారులు, ఆందోళనలతో హడలెత్తిస్తున్నారు మధ్యాహ్నం వేళ నుండి జాతీయ రహాదారిపైనే వంటావార్పు నిర్వహిస్తూ, సామూహిక భోజనాలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆందోళన స్థలికి చేరుకొని స్పష్టమైన సమాదానం ఇచ్చేంత వరకు రాస్తారోకో కొనసాగిస్తామని, పరిశ్రమను వ్యతిరేకి స్తున్న అక్కడి ప్రాంత గ్రామస్తులు వెల్లడించా రు. ప్రభుత్వం అధికారులు, పోలీసు అధికారులు ఆందోళనకారులను సముదాయించేందుకు విశ్వప్రయత్నాలు చేపడుతున్నప్పటికి వారు ఎంత మాత్రం తగ్గడం లేదు. రాస్తారోకోతో ప్రయాణికులు తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారు. నిత్యం రాకపోకలు చేపట్టే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అగచాట్లకు పాలవుతున్నారు. వాహనాల దారిమల్లింపు చేపట్టి కుంటాల మండలం మీదుగా నిర్మల్ కు రాకపోకలు చేపట్టినప్పటికి అంతగా ఫలితం కనబడలేదు.