➖ కడ దాకా పార్టీలోనే కొనసాగుతా.. వచ్చే ఎన్నికల్లో పోటీలో చేస్తా..
➖ అసత్య ప్రచారాలు మానుకోకపోతే సరైన రీతిలో బుద్ది చెప్తా
➖బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోస్లే మోహన్ రావ్ పటేల్
బైంసా (శ్రీకరం న్యూస్) : చివరి ప్రాణం ఉన్నంత వరకు బీజేపీ పార్టీని వీడేది లేదని.. కాషాయ జెండా పట్టుకొని ముందుకు వెళ్తానని లోనే ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు పటేల్ స్పష్టం చేశారు. గురువారం బైంసా పట్టణంలోని దారాబ్జి జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భోస్లే మోహన్ రావ్ పటేల్ మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ఒక వర్గం తమ రాజకీయ లాబ్ది కోసం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తగిన రీతి లో బుద్ధి చెబుతానన్నారు. రాజకీయంగా అనగదొక్కలని, బూటకపు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తాను ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చానని, పల్లె పల్లెకు బీజేపీ.. గడప గడపకు మోహన్ రావ్ పటేల్.. కార్యక్రమం ద్వారా ముధోల్ నియోజక వర్గంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లానని గుర్తు చేశారు. తనకు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా పార్టీలో ఉన్నానని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. రాబోయే రోజులలో కచ్చితంగా ముధోల్ నియోజక వర్గం నుంచి పోటీలో ఉంటానని, తాను పదవిలో లేకపోయినా మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పారు. ఇక నుంచి తనపై అసత్యపు ప్రచారాలు మానుకోవాలని, లేని యెడల ప్రజలే రాబోయో రోజులలో తగిన బుద్ది చేబుతారని హెచ్చరించారు.