– ముథోల్ న్యూ జీపీ సమీపంలో ఘటన
భైంసా (శ్రీకరం న్యూస్) ; నియోజకవర్గ కేంద్రమైన ముథోల్ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డా వృద్ధుడు ఒకరు చికిత్స పోందుతూ సోమవారం వేకువ జామున మృతి చెందాడు. ముథోల్ నయాబాదీ కాలనీకి చెందిన సృంగారి దత్త (65) ఆదివారం ఉదయం ఇంటి నుంచి బస్టాండ్ కు వెళ్తుండగా, కొత్త గ్రామ పంచాయతీ వద్ద భైంసా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. క్షతగాత్రుడిని ముందుగా భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం గాను నిజామాబాద్ లోని ఒక ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పోందుతున్న వృద్ధుడు దత్త సోమవారం వేకువ జామున వేళలో మృతి చెందాడు. మృతుని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముథోల్ ఎస్సై కే. సంజీవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.