బైంసా, (శ్రీకరం న్యూస్) : స్వచ్చ ఛావని కెటగిరిలో బైంసా వాసి ఒక్కరు రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్సలెన్స్ 2024 అవార్డు స్వీకరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో హెల్త్ సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్న బైంసా పట్టణంలోని పులేనగర్ కాలనీవాసి దేవేందర్ సంబంధిత అవార్డుకు ఎంపికయ్యారు. రెండు రోజుల క్రితం న్యూ ఢీల్లీలోని చాణక్య ఆడిటోరియములో రక్షణ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేతు, రక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ జి.ఎస్ రాజేశ్వరన్ చేతుల మీదుగా కంటోన్మెంట్ బోర్డు హెల్త్ సూపరిండెంట్ దేవేందర్ సంబంధిత అవార్డును స్వీకరించారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రాంతాల్లో స్వచ్ఛదనం,పచ్చద నం, పరిశుభ్రత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు అక్కడి ప్రాంతాలను ఆరోగ్యవంతమైన కేంద్రాలుగా తీర్చిదిద్దినందుకు గాను బోర్డు సీఈవో మధుకర్ నాయక్, శానిటరీ సూపరిండెంట్ మహేందర్ తో కలిసి హెల్త్ సూపరిండెంట్ దేవేందర్ కేంద్ర మంత్రిత్వ రక్షణ శాఖ నుంచి ఎక్సలెన్స్ 2024 అవార్డును అంద చేసింది.