* వానల్ పాడ్ గ్రామం వద్ద ప్రమాదం
– ట్రాక్టర్, బైక్ ఢీకొట్టుకోవడముతో ఘటన
– ప్రమాద స్థలిలోనే మృతి
బైంసా, (శ్రీకరం న్యూస్): మండలంలోని వానల్ పాడ్ గ్రామం వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కుంటాల మండలంలోని విఠాపూర్ గ్రామానికి చెందిన ఇంద్రాసేనా రెడ్డి (38) అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. స్వంత పనుల నిమితం భైంసాకు వచ్చిన ఇంద్రాసేనా రెడ్డి తిరిగి స్వగ్రామానికి బైక్ పై వెలుతుండగా వానల్పాడ్ గ్రామం వద్ద ప్రమాదం బారిన పడ్డాడు. పెండ్ పెల్లి గ్రామం నుంచి జాతీయ రహాదారి మార్గం మీదుగా వానల్పాడ్ గ్రామం లోపలికి వ స్తున్న ట్రాక్టర్, భైంసా నుంచి విఠాపూర్ కు వెలుతున్న ఇంద్రాసేనా రెడ్డి బైక్ ఢీకొట్టుకోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఇంద్రాసేనా రెడ్డి ప్రమాద స్థలిలోనే మృత్యువాత పడ్డాడు. బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బైంసా రూరల్ ఎస్ఐ మాలిక్ కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.