– యువజన విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం
– వానల్ పాడ్ లో ఇటుక బట్టి కార్మికులకు అందజేత
భైంసా (శ్రీకరం న్యూస్) ; చలితో విలవిల లాడిపోతున్న కార్మికులకు సత్యసాయి సేవా సమితి దుప్పట్ల పంపిణీ చేపట్టింది. సేవా సమితి యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం దుప్పట్ల పంపిణీ నిర్వహించింది. ఇందులో భాగంగానే భైంసా మండలంలోని వానల్ పాడ్ గ్రామ పరిసర ప్రాంతాల్లోని ఇటుక బట్టి కార్మికులకు సేవా సమితి యువజన విభాగం దుప్పట్ల పంపిణీ నిర్వహించింది. సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు భీంసేన్, మహిళ విభాగం అధ్యక్షురాలు సుజాత, యువజన విభాగం అధ్యక్షురాలు స్వప్న, భైంసా ప్రతినిధులు సూరిబాబు (పెయింటర్), శ్రీనివాసారాజు, శ్రీనివాస్ (ఎన్సీసీ), ఎం. శ్రీనివాసరావు, సాయినాథ్ యాదవ్, భగవన్ సింగ్, గోపి, ప్రదీప్ లు దుప్పట్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా వానల్ పాడ్ ఇటుక బట్టిల వద్ద ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి సేవా సమితి దుప్పట్ల పంపిణీ నిర్వహించింది. ఇందులో భాగంగా సేవా సమితి ప్రతినిధులు ఇటుక బట్టి కార్మికులకు ఆరోగ్య రక్షణకు పాటించాల్సిన జాగ్రత్త చర్యలు, శుచి, శుభ్రత, పరిశుభ్రత చర్యలపై అవగాహన కల్పించారు.