– బైంసాలో మాతృశక్తి బాధ్యుల నియామకం.
– దిశ నిర్దేశం చేసిన ప్రాంత సంయోజక్ శ్రీవాణి
బైంసా, (శ్రీకరం న్యూస్): పాశ్చత్యదోరణి విధానాలతో దెబ్బతింటున్న సనాతనమైన హిందూ ధర్మ సంస్కృతి, సంప్రదాయాలు, అచార వ్యవహరాలు విషయాల్లో మహిళలను చైతన్యపరచేందుకు మాతృశక్తి సంస్థల బాధ్యులు అం కితమవ్వాలని విహెచ్ పీ ప్రాంత సహా సంయోజక్ శ్రీవాణి పిలుపునిచ్చారు. గురువారం బైంసాలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన నగర మాతృశక్తి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అధునిక పోకడల తో అనర్దాలు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోజురోజుకు పెరుగుతున్న పాశ్చత్య దోరణి అల వాట్లతో అచార, వ్యవహరాలు కనుమరుగవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ప్యాషన్ విధానాలతో కట్టు,బొ ట్టు పాటించే వారి సంఖ్య క్రమక్రమంగా తక్కువవుతోందన్నారు.. సెల్ ఫోన్ వ్యామోహంతో సమస్యలు ఇంతకింత కి పెరిగిపోతున్నాయని వివరించారు. సమాజంలో మహిళలు, యువతులు, విద్యార్థినీలు ఎదుర్కొంటున్న సమ స్యలను విశధికరించారు. ఇలాంటి ఉపద్రవాల నుంచి మహిళలను జాగృతపరచేందుకు మాతృశక్తి బాధ్యులు కార్మో ణ్ముఖులుగా కావాలన్నారు. బాధ్యతాయుతమైన విధానాల ద్వారా మహిళలతో పాటు యువతులు, బాలికల చైతన్యానికి అంకితమవ్వాలన్నారు. ప్రధానంగా యువతులు, విద్యార్థినీలకు లవ్ జిహద్ విషయంలో అప్రమత్తం చేయాలని సూచించారు. అచార వ్యవహరాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించి వారిలో పరిణతి కల్పింపంచే యాలన్నారు. వారందరిలో ఆధ్యాత్మిక జాతీయత భావాలు పెంపొందింప చేసేందుకు మార్గదర్శకంగా పాటుప డాలన్నారు. ఈ సందర్భంగా బైంసా నగర్ మాతృశక్తి సంయోజక్ గా సుప్రియ, సహా సంయోజక్ గా రాఘవి. సత్సంగ్ బాల సంస్కార్ కేంద్ర ప్రముఖ్ గా మియాపురం శ్రీవాణి. పెన్షన్వార్ జ్యోతి సేవా ప్రముఖ్ గా బచ్చు మమ త, సహసేవా ప్రముఖు గా ధనశ్రీ, ముత్యపువా ర్ స్రవంతి, గుజ్జల్వార్ సవిత, గంగామణి, విశాలలు బాధ్యతలు స్వీకరిం చారు. ఇందులో విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు గుజ్జల్వార్ వెంకటేష్, జిల్లా సహా కార్యదర్శి పెరుగు నవీన్, నగర అధ్యక్షులు డా.మహిపాల్ ఉపాధ్యక్షులు రంగు శ్రీనివాస్, డి.రాజేందర్, కార్యదర్శి శివ, లంక గంగాధర్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.