– బైంసాలో మిత్రమండలి సమావేశంలో వక్తల సందేశం
– ఉద్యోగాలు సాధించిన కులస్తులకు ఘన సన్మానం
– ఆదర్శ ఉద్యోగులుగా గుర్తింపు తెచ్చుకోవాలని సూచన
బైంసా, (శ్రీకరం న్యూస్): మున్నురు కాపు కుల సభ్యులందరూ అన్ని రంగాల్లోనూ దీటుగా రాణించేందుకు సంఘటితంగా ముందుకు సాగుతూ సత్పలితాలను సాదించాలని మున్నురుకాపు మిత్ర మండలి ప్రతినిధులు అకాంక్షించారు. ఆదివారం బైంసాలోని శ్రీ బంకెట్ హాల్ లో బైంసా మున్నురుకాపు మిత్ర మండలి ఆధ్వర్యంలో కొత్తగా ప్రభుత్వ కొలువులు సాధించిన ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న ము న్నురుకాపు మిత్ర మండలి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుప్పాల రమేష్, కొబ్బాయి శంకర్, పీఆర్టీ యూ నిర్మల్ జిల్లా అధ్యక్షులు నరేంద్రబాబు. బీజేపీ ముథోల్ నియోజక వర్గ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్. బైంసా మున్నురుకాపు మిత్ర మండలి అధ్యక,ప్రధాన కార్యదర్శులు గాలి రవి, పెదకాపు గజారామ్, బైంసా మున్సిపల్ మాజీ చైర్మెన్ బి.గంగాదర్ లు మాట్లాడుతూ తీవ్రమైన పోటీ వాతవరణం నెలకొన్న పరిస్థితుల్లోనూ కుల సభ్యులు అధిక సంఖ్యలో ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో కొలువులు సాధించిన ఉద్యోగులందరూ మార్గదర్శకమైన తీరుతో విధులను నిర్వర్తించాలన్నారు. ఉద్యోగ బాధ్యతలను ఆదర్శంగా చేపట్టాలని అకాంక్షించారు. సక్రమమైన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాల న్నారు. కులస్తులందరూ ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలుపంచుకోవాలన్నారు. నిరుపేద కులస్తులకు చేయుతనిచ్చేందుకు అన్ని విధాలుగా సహాయ,సహకారాలు అందించాలన్నారు.ఉన్నత విద్యాభ్యాసాలకు, ప్రవేశ, ఉద్యోగ పరీక్షలకు అవసరమైన రీతిలో తోడ్పాటునివ్వాలన్నారు. ఈ సందర్భంగా బైంసా డివిజన్ మున్ను రుకాపు మిత్ర మండలి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గాలి రవి, పెదకాపు గజారామ్, కోశాధికారి కార్లాం వినో ద్ కుమార్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు సాధించిన మున్నురుకాపు కులస్తులకు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు బహుకరించారు. ఇందులో మిత్ర మండలి నిర్మల్ ప్రతినిది బల్సగజ్జారాం, హిందు ఉత్సవ సమితి బైంసా అధ్యక్షులు పెండెపు కాశీనాథ్, వెండిబంగారు వర్తక సంఘం అధ్యక్షులు మైస గోపాల్, బీజేపీ ప్రతినిధులు ఎనుపోతుల మల్లేశ్వర్, రావుల పోశెట్టి, డా. రజనీకాంత్, ఎక్సైజ్ శాఖ సీఐ వెంకటేష్, పశువైద్యాధికారి డా.విఠల్ తో పాటు పలువురు పాల్గొన్నారు.