- – ఉత్తమ క్యాచ్ అవార్డు అందుకున్న రమేష్ పాటిల్
– మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ గా కిరణ్( మణికంఠ వారియర్స్)
– బెస్ట్ బౌలర్ గా ముఖీమ్(హంటర్ వారియర్)
– విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన బోస్లే మోహన్ రావ్ పాటిల్
బైంసా, (శ్రీకరం న్యూస్): డివిజన్ స్థాయి ఫోటో, విడియోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భైంసా డివిజన్ ఫోటోగ్రాఫర్స్ లీగ్ క్రికెట్ టౌర్ని విజేతగా బైంసాకు చెందిన మణికంఠ వారియర్స్ నిలిచింది. మూడు రోజుల పాటు బైంసాలోని గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియమ్ లో క్రికెట్ టోర్నీ కొనసాగింది. బైంసా డివిజన్ పరిధిలోని వివిధ ప్రాం తాలకు చెందిన ఫోటో, వీడియోగ్రాఫర్లకు చెందిన 6 జట్లు టౌర్నిలో పాల్గొన్నాయి. ఫైనల్ పోటీలో హన్మంతోళ్ల కిషోర్ సారధ్యంలోని మణికంఠ వారియర్స్, హంటర్ వారియర్స్ తలపడ్డాయి. హోరాహోరిగా కొనసాగిన ఫైనల్ మ్యాచ్ లో మణికంఠ వారియర్స్ విజయం సాదించింది. టౌర్నిలో ఉత్తమ క్యాచ్ అవార్డును రమేష్ పా టిల్ (ఎస్ డి ఎస్ టీం )., ఉత్తమ బౌలర్ గా ముఖీమ్( హంటర్ వారియర్) మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ గా కిరణ్( మణికంఠ వారియర్)లు ఎంపికయ్యారు. విజేతలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోస్లే మోహన్ రావ్ పాటిల్ జిల్లా ఫోటోగ్రఫీ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యకులు ప్రవీణ్, రమేష్ పాటిల్, రావుల పోశెట్టి, డివిజన్ అధ్యక్షులు మణికంఠలతో కలిసి బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా బోస్లే మోహన్ రావ్ పాటిల్ మాట్లాడుతూ క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందుతాయన్నారు. ప్రతీ ఒక్కరు ఆరోగ్యవంత మైన జీవితం కోసం క్రీడలు, వ్యాయమం తమ తమ జీవితాల్లో భాగంగా చేసుకోవాలని పేర్కొన్నారు. క్రీడల ద్వారా మానసికోల్లాసంతో పాటు దేహదారుడ్యం చేకూరుతందన్నారు. ఆటగాళ్లు క్రీడా స్పూర్తితో తమ ప్రతి భను ప్రదర్శించాలని అకాంక్షించారు. ఓటమి చెందిన జట్టు నిరాశ చెందకుండా రానున్న పోటీల్లో విజేతగా నిలిచేందుకు శ్రమించాలని సూచించారు. ఇందులో డివిజన్ ఫోటో, వీడియోగ్రఫీ అసోసియేషన్ ప్రతినిధులు దత్త ప్రసాద్ (పండిత్), అల్లూర్ దత్తు, వరగంటి విఠల్ లతో ముధోల్ నియోజక వర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల ఫోటో, వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.