– ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వృందావన్ లో ఘటన # కుబీర్ మండలంలోని పల్చి యాత్రీకుని సజీవ దహనం
– మిగతా యాత్రీకులంతా పూర్తిస్థాయిలో సురక్షితం
– బస్పు,యాత్రీకుల సామాగ్రి పూర్తిగా దగ్ధం
– యూపీ పోలీసుశాఖ, ఆర్ ఎస్ ఎస్ సంరక్షణలో యాత్రీకులు
– వసతులు కల్పించిన అక్కడి ఆర్ఎన్ఎస్, వ్యాపార సంస్థలు
భైంసా (శ్రీకరం న్యూస్): భైంసా డివిజన్ పరిధి నుంచి ఈ నెల 1న తీర్ధయాత్రలకు బయలు దేరిన యాత్రీకుల బస్సు ఒకటి అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వృందావన్ క్షేత్రంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో కుభీర్ మండలంలోని పల్సి గ్రామానికి చెందిన వృద్ధుడొకరు సజీవ దహనం అయినట్లుగా తెలిసింది. ఘటనలో బస్సుతో పాటు యాత్రీకులకు సంబందించిన సామాగ్రి, దుస్తులు, నగదు, ఇతర వస్తువులు హర్తిగా దగ్గమయ్యాయి. మదుర నుంచి వృందావన్ యాత్రీకుల బస్సు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చేరుకుంది. యాత్రకు బయలుదేరిన 50 మంది యాత్రీకులలో అందరూ వృందావన్ క్షేత్ర సందర్శనకు తరలివెళ్లారు.ఇందులో కుభీర్ మండలంలోని పల్సి గ్రామానికి చెందిన వృద్దుడొకరు ఆనారోగ్య కారణాలతో వృందావన్ దర్శనానికి వెళ్లకుండా బస్సులోనే ఉండిపోయాడు. ఇదే సమయంలో బస్సుకు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంలో అందలోనే ఉన్న సంబందిత వృద్ధుడు సజీవ దహనం అయ్యాడు. మంటల తీవ్రతకు బస్సుతో పాటు ప్రయాణికులు వస్తువులు, సామాగ్రి, నగడుతో పాటు ఇతర వస్తువలన్నీ పూర్తి స్థాయిలో దగ్ధమయ్యాయి. దీంతో యాత్రీకులందరూ కట్టు బట్టాలతోనే మిగిలిపోయారు. బస్సుకు అంటిన మంటలను అక్కడి ఫైర్ సిబ్బంది ఆర్పివేసే చర్యలు చేపట్టినప్పటికి అప్పటికి బస్సుతో పాటు అందులోని వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. యాత్రీకులు వృందావన్ దర్శనానికి వెళ్లి తిరిగి వ
సమయానికి బస్సు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, వృద్ధుడు దహనం కావడం జరిగిపోయింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
*అక్కడి పోలీసు, ఆర్ఎస్ఎస్ శ్రేణుల సంరక్షణలో యాత్రీకులు
• ప్రమాదంలో కట్టుబట్టలతో మిగిలిన యాత్రీకులకు వృందావన్ పోలీసు అదికారులు, ఆర్ఎస్ఎస్ శ్రేణులు సంరక్షణ కల్పించారు. యాత్రీకుల కోసం అక్కడి టూరిస్ట్ ఫెసలిటీ సెంటర్లో బస ఏర్పాటు చేశారు. భోజన వసతి కల్పించారు.వారందరిని సురక్షితంగా బైంసాకు తరలించే ఏర్పాట్లపై అక్కడి ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు చర్యలు చేపట్టారు. పోలీసు అధికారులు సైతం యాత్రీకులకు అవసరమైన వసతులు, సౌకర్యాలు కల్పించారు. వృందావన్ క్షేత్రానికి చెందిన పలువురు వ్యాపారస్తులు యాత్రీకులకు కప్పుకునేందుకు దుప్పట్లు, ధరించేందుకు దుస్తులతో పాటు ఇతర సామాగ్రిని ఉచితంగా అందచేశారు. యాత్రీకులకు ఎలాంటి భయాందోళనల బారిన పడకుండా ఉండేందుకు గాను అక్కడి పోలీసులు . అర్ఎస్ఎస్ శ్రేణులు, వ్యాపారస్తులు పూర్తిస్థాయిలో సహయ సహకారాలు అందిస్తున్నారు.
– *భర్త సజీవ దహనం, భార్య సురక్షితం*
యాత్రలకు కుభీర్ మండలంలోని పల్పి గ్రామానికి చెందిన దంపతులిద్దరు వెళ్లారు. బస్సు వృందావన్ క్షేత్రానికి చేరుకున్న అనంతరం యాత్రీకులంతా దర్శనం కోసం బయలు చేరారు. అయితే పల్సి నుంచి వెళ్లిన దంపతుల్లో భర్త అనారో కారణంతో బస్సులోనే ఉండిపోగా, భార్య ఇతర యాత్రీకులతో కలిసి దర్శనం కోసం వెళ్లింది. ఇదే సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో బస్సులో ఉన్న భర్త సజీవ దహనం అవ్వగా దర్శనం కోసం వెళ్లిన భార్య సురక్షితంగా బయటపడింది.