– రెండు బస్సులను ఏర్పాటు చేసిన ఉత్తర్ ప్రదేశ్ అధికారులు
• దారి ఖర్చులకు ఒక్కోక్కరికి రూ.1000 పంపిణీ
● మార్గ మధ్యలో భోజనాలు చేసేందుకు ఆహార పాకెట్ల అందచేత
• అక్కడి వారు తమను కుటుంబ సభ్యుల వలే ఆదరించారని యాత్రీకుల వెల్లడి
– ఫలించిన కేంద్రమంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే రామరావ్ పాటిల్ కృషి
భైంసా (శ్రీకరం న్యూస్), తీర్ధయాత్రలకు వెళ్లి బస్సు అగ్ని ప్రమాదం బారిన పడటంతో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వృంధావన్ క్షేత్రంలో చిక్కుకుకున్న బైంసా డివిజన్ యాత్రీకులు స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం సాయంత్రం నుంచి వృందనాద్ క్షేత్రంలోని టూరిస్ట్ పెనలిట్ సెంటర్లో అక్కడి పోలీసు, రెవెన్యూ అధికారుల సంరక్షణలోనున్న ఇక్కడి యాత్రీకుల బృందం బుధవారం ఉదయం వేళలో భైంసాకు జయలుదేరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పాటిలు చొరవ చూపి అక్కడ చిక్కుకున్న యాత్రీకులను స్వస్థలాలకు తరలింప చేసేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. వీరిద్దరి విజ్ఞప్తికి స్పందించిన అక్కడి రెవెన్యూ, పోలీసు అధికారుల బృందం యాత్రీకులను భైంసాకు తరలించేందుకు గాను రెండు బస్సులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఒక్కో యాత్రీకునికి దారి ఖర్చులకు గాను రూ. 1000 చొప్పున పంపిణీ చేశారు. ఉదయం వేళలో యాత్రీకులకు భోజనాలు అందించిన అక్కడి అధికారులు, ఆర్ఎస్ఎస్ శ్రేణులు మార్గమద్యంలో భోజనాలు చే సేందుకు గాను ఆహర ప్యాకెట్లను అందచేశారు. వీటితో పాటు బిస్కెట్ పాకెట్లు, కొన్ని రకాల పండ్లు, వాటర్ బా టిళ్ళు సైతం యాత్రీకులకు సమకూర్చారు. దీర్ఘకాలిక వ్యాధులతోనున్న బాధితులు వేసుకునేందుకు గాను రోజు వారి మాత్రలను సైతం అందించారు. బుధవారం ఉదయం అక్కడి నుంచి బయలు దేరిన యాత్రీకుల బృందం గురువారం రాత్రి వేళ వరకు బైంసాకు చేరుకోనున్నట్లుగా తెలిసింది. మంగళవారం రాత్రి వేళ నుంచి బుధవారం వరకు యాత్రీకుల బృందానికి అక్కడి పోలీసు, రెవెన్యూ అధికారులతో పాటు అర్ఎస్ఎస్ శ్రేణులు, పలు వ్యాపార సంస్థల ప్రతినిధులు వసతి కల్పించి పూర్తి స్థాయిలో నపర్యలు చేసినట్లుగా సమాచారం. వారందరూ సమన్వయంతో వ్యవహరిస్తూ సమిష్టిగా యాత్రీకులకు సేవలు అందించినట్లుగా తెలిసింది. తమకు కప్పుకునేందుకు దుప్పట్లు, ధరించేందుకు దుస్తులు, తొడుక్కునేందుకు చెప్పులతో పాటు అవసరమైన ఇతర సామాగ్రిని ఉచితంగా అందచేసారని యాత్రీకులు తె లిపారు. ఆందోళనలతోనున్న తమకు అక్కడి వారు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి కొలుకునేలా తోడ్పాటునిచ్చారని పలువురు యాత్రీకులు వివరించారు. కుటుంబ సభ్యుల వలే ఆదరించి తమను అన్ని విదాలుగా ఆదుకున్నారని యాత్రీకులు పేర్కొన్నారు. వారందరికీ జన్మజన్మల రుణపడి ఉంటామని యాత్రికుల బృందం తెలిపింది.