• కన్నుల పండువగా కొనసాగుతున్న వేడుకలు
• ఆలయ ప్రాంగణంలో చండీ హోమం
• సర్వంగా సుందర్భంగా ముస్తాబైన ఆలయం
• భారీగా హజరుకానున్న భక్తజనం
బైంసా, (శ్రీకరం న్యూస్): మున్సిపల్ కేంద్రమైన భైంసా పట్టణ భట్టిగల్లిలోని శ్రీ బద్ధి పోచమ్మ ఆలయంలో సోమవారం అమ్మవారి విగ్రహా ప్రతిష్టాపనోత్స కార్యక్రమం జరుగనుంది. శనివారం ప్రారంభమైన విగ్రహ ప్రతిష్టాపన మహోత్స వాలు సోమవారం జరిగే అమ్మవారి ప్రతిష్టాపనోత్సవంతో ముగియనున్నాయి. మూడు రోజులుగా భక్తుల కోలాహ లం మద్య వేడుకలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ప్రతిష్టాపనోత్సవములో భాగంగా శనివారం అమ్మవారి విగ్రహానికి జలదివాస్ నిర్వహించిన వేద పండితులు ఆదివారం దాన్యదివాస్, శయ దివాస్ పూజా కార్యక్రమాలు చేప ట్టారు. ఇందులో భాగంగానే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం చండి హోమం నిర్వహించారు. కాలనీ పరిధి లోని పలువురు దంపతులు హోమం పాల్గొన్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ ప్రాంగణంలో వివిధ ప్రాం తాల భజన మండలీలు భజన కార్యక్రమాలు చేపట్టాయి. రాత్రి వేళలో నిర్మల్ బృందంచే ఆర్కెస్ట్రా కార్యక్రమం నిర్వ హించబడింది.
*నేడు విగ్రహా ప్రతిష్టాపన*
శ్రీ బద్దిపోచమ్మ ఆలయంలో సోమవారం అమ్మవారి విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమం జరుగనుంది. ఇందు కోసం గాను ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి క్షేత్రాన్ని సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలతో శోభయమా నంగా అలంకరించారు. ఉదయం 10.01 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారు కొలువు తీరను న్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించనుంది. శ్రీ బద్దిపోచమ్మ అమ్మ వారి విగ్రహా ప్రతిష్టాపనోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో హజరుకున్నారు. ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉండేందుకు గాను ఆలయ కమిటీ పకడ్బంధీగా ఏర్పాట్లు చేపట్టింది.