Srikaram News
తెలంగాణరాజకీయం

దిల్లీ పీఠ కైవసంతో భైంసాలో బీజేపీ విజయోత్సవ సంబరాలు

ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రదర్శనలు
* ప్రధాన రోడ్డు మార్గంలో మిఠాయిల పంపిణీ
* టపాసులు కాల్చుతూ నృత్యాలు

బైంసా, (శ్రీకరం న్యూస్): ఢిల్లీ అసెంబ్లీ పీఠాన్ని కమల దళం కైవసం చేసుకున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని భైంసాలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. శనివారం మధ్యాహ్నం పార్టీ బైంసా పట్టణ కమిటీ అధ్యక్షుడు ఎనుపోతుల మల్లేశ్వర్, మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డిల నేతృత్వంలో బీజేపీ శ్రేణులు చేపట్టిన విజయోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పార్టీ ప్రతినిధులు ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ప్రధాన రోడ్డు మార్గంలో పాదచారులు, వాహనాలలో రాకపోకలు నిర్వహిస్తున్న ప్రయాణీకులకు మిఠాయిలు పంచిపె ట్టారు. ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టారు. ఫ్యాక్టరీ ప్రవేశ మార్గంలో టపాసులు కా ల్చారు. విజయోత్సవ సంబరాల్లో భాగంగా బీజేపీ శ్రేణులు నృత్యాలతో హోరెత్తించారు. ప్రధాని మోదీ సారధ్యంతోనే పార్టీ దిల్లీ అసెంబ్లీని కైవసం చేసుకుందని పేర్కొంటూ పెద్దపెట్టున నినాదాలు చేపట్టారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పాటిల్ నాయకత్వానికి బలపరుస్తూ ప్రదర్శనలు చేపట్టారు. గంటకు పైగా బీజేపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు జోరుగా… హుషారుగా కొనసాగాయి. ఇందులో పార్టీ ప్రతినిధులు గౌతం పింగ్లే, రావుల పోశెట్టి, సోలంకే భీంరావ్ పాటిల్, వడ్నపు శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా నాయకులు బండారి దిలీప్​, రావుల రాము. మానిక్ దగ్గే, గాలి రాజు, రేవాజీ నర్సయ్య, దత్తు, ముల్లావార్ అనిల్, కాసరి ప్రవీణ్, హన్మాండ్లులతో పాటు పలువురు పాల్గొన్నారు.

0Shares

Related posts

నిర్మల్ కుండపోత వర్షం

Srikaram News

గడ్డేన్న వాగు ప్రాజెక్ట్ వరద గేట్లు నుంచి మరింత పెరిగిన అవుట్ ఫ్లో

Srikaram News

పోటాపోటీగా బైంసా వెండి, బంగారు వర్తక సంఘం ఎన్నికలు

Srikaram News

అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ బద్దిపోచమ్మ విగ్రహా ప్రతిష్టాపనోత్సవాలు

Srikaram News

మున్నురుకాపులంతా సంఘటితంగా సాగాలి…. సత్ఫలితాలు సాదించాలి…

Srikaram News

ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జాతీయ రహదారిపై రాస్తారోకో

Srikaram News

Leave a Comment