* భైంసాలో గ్రంథాలయాల అధునీకరణకు హమీ
* ఐటీఐ కళాశాల ఏర్పాటు కృషి చేస్తానని వెల్లడి
* భైంసా ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి
బైంసా (శ్రీకరం న్యూస్): మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్-కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తన స్వంత నిధులను వెచ్చించి రూ.3 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తానని పట్ట భద్రుల నియోజక వర్గ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం నిర్మల్ జిల్లా బైంసాలోని హరియాలి పంక్షన్ హల్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లోని ఉద్యోగులకు చేయూత నిచ్చే చర్యల్లో భాగంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. ఇదే క్ర మంలో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు బాధ్యతాయుతంగా పాటు పడుతానని తెలిపారు. పట్టభద్రులందరూ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓటు వేసి గెలిపించి ప్రజా సేవ కల్పించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రాంతవాసుల సూచనల మేరకు తాను భైంసా పట్టణ పరిధిలోని గ్రంథాలయాల అధునీకరణకు బాధ్యతాయుతతో కృషి చేస్తానని వెల్లడించారు. ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కార్మోణ్ముఖులై ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వాన్ని చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పట్టభద్రులను కలిసి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగ ఉపాది కల్పన విషయాలను వివరించి వారి మద్దతు కూడగట్టుక నేందుకు పాటు పడాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సానుకూల వాతవరణం నెలకొన్న నేపథ్యంలో సంబంధిత అవకాశాన్ని పార్టీ శ్రేణులు సద్విని యోగం చేసుకొని తనను భారీ మెజార్టీతో గెలిపించేందుకు అంకితభావంతో పాటుపడాలని విజ్ఞప్తి చేశారు.