Srikaram News
తెలంగాణరాజకీయం

పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో కోటీశ్వరులు

• బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి కుటుంబ ఆస్తులు రూ.175 కోట్లకు పై మాటే•

కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కుటుంబ ఆస్తులు రూ.43.38 కోట్లు

• మల్క కొమురయ్య కుటుంబం రూ.17.93 కోట్ల విలువ గల 4,457 గ్రాముల బంగారం

బైంసా, (శ్రీకరం న్యూస్): కరీంనగర్-మెదక్- ఆదిలాబాద్- నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో కోటీశ్వరులే అధికంగా బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కోటీశ్వరులుగానున్నారు. బరిలో నిలిచిన ఆయా ఎమ్మెల్సీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల సమర్పణలో వెల్లడించిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన చిన్నమైల్ అంజిరెడ్డి ఆస్తులు మొత్తం రూ.175 కోట్ల చిలుకుగా ఉంది. ఇందులో ఆయన వ్యక్తిగత ఆస్తులు రూ.120.40 కోట్లు గా ఉండగా ఆయన భార్య ఆస్తులు రూ.54.70 కోట్లుగా ఉన్నాయి. ఇక భార్యభర్తలిరువురి వద్ద 2,100 గ్రాముల బంగారం ఉండగా వీటి విలువ రూ.1.62 కోట్ల వరకు ఉంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి. నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ రూ.43.38 కోట్లుగా ఉంది. ఇందులో నరేందర్ రెడ్డి వ్యక్తిగత ఆస్తులు రూ.30 కోట్ల వరకు ఉండగా ఆయన భార్య ఆస్తులు రూ.13.38 కోట్లుగా ఉన్నాయి. ఇక ఆయన భార్య క్రిస్టా కారు, అర కిలో బంగారం ఉండగా ఉమ్మడి ఆస్తులు రూ.2 కోట్లుగా ఉన్నాయి. ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన మల్క కొమురయ్య వ్యక్తిగత ఆస్తులు రూ.32.08 కోట్లు, ఆయన భార్య ఆస్తులు రూ. 28.55 కోట్లు కలిపి మొత్తం 61.63 కోట్లుగా ఉన్నాయి. మల్క కొమురయ్య భార్య వద్ద 1,457 గ్రాముల బంగారం ఉండగా వీటి విలువ రూ.1783 కోట్లుగా ఉంది. మరో ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి ఆస్తులు మొత్తం రూ. 20 కోట్లకు పైగానే ఉన్నాయి. ఇందులో స్థిరాస్తులు రూ.8.56 కోట్లు, చరాస్తులు రూ.1.19 కోట్లుగా ఉన్నాయి బీఎస్సీ తరపున నామినేషన్ దాఖలు చేసిన ప్రసన్న హరికృష్ణ ఆస్తులు మొత్తం రూ.2.65 కోట్లుగా ఉండగా ఇందులో ఆయన వ్యక్తిగత ఆస్తులు రూ.49.07 లక్షలుగా ఉన్నాయి. ఆయన భార్య ఆస్తులు రూ.2.16 కోట్లు, 300 గ్రాముల బంగారం అభరణలున్నాయి. ఫార్వర్డ్ బ్లార్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రవీందర్ సింగ్ చరాస్తులు రూ.1.10 కోట్లు, స్థిరా స్తులు రూ.73.81 లక్షలు కలుపుకొని మొత్తం 1.83 కోట్లుగా ఉన్నాయి.

0Shares

Related posts

నాగదేవత ఆలయ చోరి కేసు చేదించిన పోలీసులకు రివార్డులు

Srikaram News

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం

Srikaram News

భైంసా డివిజన్ యాత్రీకుల బస్సుకు అగ్ని ప్రమాదం

Srikaram News

భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గా సిందే ఆనంద్ రావ్ పాటిల్

Srikaram News

మరో గంటన్నర వ్యవదిలో బైంసాకు చేరుకోనున్న యాత్రీకుల బృందం

Srikaram News

భైంసాలో వృద్ధ దంపతులకు బురిడికొట్టి రెండు తులాల బంగారు చైన్ ఆపహారణ

Srikaram News

Leave a Comment