Srikaram News
క్రైమ్తెలంగాణ

_అనారోగ్యంతో తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వడ్నపు రాజేశ్వర్ మృతి_

@ అందరివాడిగా పేరుప్రఖ్యాతలు
@ కరోనా కాలంలో అనిర్వచనీయమైన సేవలు

@ బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణంలో ప్రధాన భూమిక
@ స్వంత నిధులు వెచ్చించి పలు సమస్యలు పరిష్కారం

భైంసా (శ్రీకరం న్యూస్) : మున్సిపల్ కేంద్రమైన బైంసాలో అందరివాడిగా పేరు, ప్రఖ్యాతులు సాదించిన సౌమ్యుడు, సోశిల్యుడైన గణేష్ నగర్ కాలనీకు చెందిన 23వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ వడ్నపు రాజేశ్వర్ మృతి చెందాడు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో తీవ్ర అస్వస్థత చెందిన ఆయన ఆరోగ్య పరిస్థితి మంగళవారం అర్ధరాత్రి వేళలో విషమంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు చికిత్సల నిమిత్తం హుటహూటిన స్థానిక కమల థియేటర్ రోడ్డు మార్గంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడి ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతూ బుధవారం సాయంత్రం వేళలో తుదిశ్వాస విడిచాడు. గురువారం ఉదయం వద్నపు రాజేశ్వర్ అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన మృతితో 23వ వార్డు వరిధిలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి.

పదవులకు వన్నె తెచ్చిన మహోన్నత మూర్తి..

మున్సిపల్ కౌన్సిలర్ tho పాటు తాను అలంకరించిన అన్ని పదవులకు వన్నె తెచ్చిన మహోన్నత మూర్తిగా వడ్నపు రాజేశ్వర్ గుర్తింపు పొందాడు. గణేష్ నగర్ మున్నూరుకాపు సంఘం కోశాదికారిగా దశాబ్దకాలానికి పైగానే సేవలు అందించారు. కాలనీ పరిధిలోని బద్ధి పొచమ్మ ఆలయ చైర్మెన్ మందిర నిర్మాణ ప్రక్రియలో కీలక భాగస్వామ్యాన్ని అందించారు. మున్సిపల్ కౌన్సిలర్ గా వార్డు పరిధిలోని పలు సమస్యలను స్వంత నిధులు వెచ్చించి పరిష్కరించారు. చిన్నపాటి పలు అభివృద్ధి పనులకు సైతం స్వంత నిధులను వ్యయం చేశారు. రాజకీయాలకు అతీతంగా చేపట్టిన సేవలు అందరి మన్ననలు పొందాయి, బద్ది పోచమ్మ ఆలయానికి విగ్రహన్ని అందించడమే కాకుండా ఆర్థికపరంగా కూడా చేయూతనిచ్చాడు. మందిర ప్రారంభోత్సవ రోజు తొలి పూజను వడపు రాజేశ్వర్ దంపతులు నిర్వహిం చారు.

కరోనా కాలంలో విశిష్ట సేవలు..

కరోనా మహమ్మరి విజృంభించిన సమయంలో పేద తరగతి ప్రజానీకం జీవన పరిస్థితులు అతలాకుతలం అయ్యాయి. తినడానికి తిండి లేక పలు కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి విషమ పరిస్థితుల్లో వడ్నపు రాజేశ్వర్ తన స్వంత నిధులను వెచ్చించి పేద తరగతి ప్రజానీకానికి అండదండగా నిలిచాడు. వారందరికీ నిత్యావసర సరుకుల పంపిణీని చేపట్టారు. గణేష్ నగర్ కాలనీ పరిధి కేంద్రం పక్షం రోజులకు పైగా కాలం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. బైంసా పట్టణ పరిధిలోని అన్ని ప్రాంతాలకు చెందిన వందలాది మంది పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించారు.

అందరి తలలో నాలుకలా…….

వార్డు వాసులందరితో సఖ్యతతో వ్యవహరిస్తూ అందరివాడిగా పేరొందాడు. అందరి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ తలలో నాలుకలా నడుచుకున్నాడు. చిన్న పేద అనే తేడా లేకుండా కలుపుగోలుతో వ్యవహరిస్తూ, అప్యాయతతో మాట్లాడుతూ అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేసుకున్నాడు.

కన్నీరు మున్నీరుగా…

వడ్నపు రాజేశ్వర్ మృతితో వార్డు పరిధిలో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బందు, మిత్రుల రోదనలు మిన్నంటాయి ఆయనతో తమకు గల బందాలను గుర్తు చేసుకుంటూ మిత్రులు, సాన్నిహిత్యన్ని నెమరు వేసుకుం టూ బంధువులు బోరున విలపించారు. ఇక మృతదేహంపై పడి భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపించడం అందరిని కంట తడి పెట్టించింది.

0Shares

Related posts

భైంసాలో మృతదేహ భద్రపాటుకు ఫ్రీజర్ సేవలు

Srikaram News

భైంసా మీదుగా పాలజ్ కు నిలిచిన రాకపోకలు

Srikaram News

బీజేపీ పార్టీని వీడే ప్రసక్తే లేదు..

Srikaram News

భైంసాలో వృద్ధ దంపతులకు బురిడికొట్టి రెండు తులాల బంగారు చైన్ ఆపహారణ

Srikaram News

భైంసా ; గడ్డెన్న ప్రాజెక్టు 5 వరద గేట్ల ఎత్తివేత

Srikaram News

భైంసా గడ్డెన్న ప్రాజెక్టు వరద గేట్ల మూసివేత

Srikaram News

Leave a Comment