– ఇప్పటివరకు 18 పర్యా యాలు రక్తదానం
– రక్తం అవసరమున్న వారికి ఆపద్భాందవుడు
– ఆదర్శంగా నిలుస్తున్న బీజేవైఎం ప్రతినిధి
భైంసా (శ్రీకరం న్యూస్) : డివిజన్ పరిధిలోని బీజేవైఎం ప్రతినిది గంగా ప్రసాద్ రక్తదానంలో మేటిగా నిలుస్తున్నాడు. 26 సంవత్సరాల వయస్సు గల సదరు యువనేత ఇప్పటి వరకు 18 పర్యాయాలు రక్తదానం చేసి ఆదర్శ రక్తదాత ఇక్కడి ప్రాంతంలో అందరిచే మన్ననలు పొందుతున్నాడు ఏ పాజిటివ్ రక్త గ్రూప్ గల సదరు యువనేత సంబందిత గ్రూప్ రక్తం అవసరమున్న వారికి అత్యవసర సమయాల్లో రక్తాన్ని దాతగా అందిస్తూ ఆపద్బాంధవుడిలా నిలుస్తున్నా డు ప్రమాదాల్లో రక్తస్రావం జరిగి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న 6 గురు భాధితులకు అత్యవసర సమయాల్లో తన రక్తాన్ని దానంగా అందించి వారి ప్రాణ రక్షణలో బాధ్యతాయుత భాగస్వామ్యాన్ని అందించాడు.ఇక రక్తహీనతతో ప్రసవ వేదనకు గురవుతున్న గర్భిణీలకు, రక్తస్రావంతో ప్రాణపాయ స్థితికి చేరుకున్న బాలింతరాళ్లకు సైతం పలు పర్యాయాలు రక్తదానం చేసే మార్గదర్శక రక్తదాతగా పేరొందుతున్నాడు.
• *2017 మంచి రక్తదానం…*
2017 ఫిబ్రవరి మాసంలో బైంసాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బాలింతరాలు తీవ్ర రక్తస్రావంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఇదే సమయంలో బంధువులను పరామర్శించేందుకు బీజేవైఎం ప్రతినిధి గంగా ప్రసాద్ తమ కుటుంబం సభ్యులతో కలిసి సదరు అసుపత్రికి వెళ్లాడు. అక్కడ బాధిత బాలింతరాలి ఆరోగ్య పరిస్థితి ప్రాణపాయ స్థితికి చేరుకుంటడు, బాధిత కుటుంబీకులు రక్తదాతల కోసం హైరానా పడుతుండటంతో గంగా ప్రసాద్ చలించిపోయాడు. అప్పటికప్పుడు. స్పందించి ఆసుపత్రిలోని ల్యాబ్ కు వెళ్లి తన రక్త గ్రూపు పరీక్షించుకొగా ఏ పాటిటివ్ గా తేలింది. దీంతో ఏ మాత్రం ఆలోచించకుండా బాలింతరాలి ఆరోగ్యాన్ని కాపాడేందుకు గాను రక్తాన్ని దానం చేశారు. బాధిత బాలింతరాలి కుటుంబీకుల్లోని కొంత మందితో పాటు అక్కడ ఉన్న మరికొంత మందికి ఏ పాజిటివ్ గ్రూప్ రక్తం ఉన్నప్పటికి రక్తదానం చేసే విషయంలో వెనుకంజ వేసారు. యువకుడైన గంగా ప్రసాద్ ఎంతమాత్రం ఆలోచించకుండా రక్తదానాన్ని చేసి ఆదర్శంగా నిలిచాడు. అప్పటికప్పుడు స్పందించి రక్తదానం చేసిన గంగా ప్రసాద్ కు ఆసుపత్రి వైద్యాధికారులు అభినందించారు. ఇక బాలింతరాలితో పాటు బాధిత కుటుంబీకుల కృతజ్ఞతతో వ్యవహరించిన తీరుకు స్పందించిన బీజేవైఎం ప్రతినిధి గంగా ప్రసాద్ అప్పటి నుంచి ప్రతియేటా రెండు నుంచి మూడు పర్యాయాలు రక్తాన్ని దానంగా అందిస్తున్నాడు.
• *మిత్రులను సైతం రక్తదానం చేసేలా చైతన్యపరుస్తూ…*
ప్రతియేటా రెండు పర్యాయాలు రక్తదానం చేస్తున్న బీజేవైఎం ప్రతినిధి గంగా ప్రసాద్ తన మిత్రులను సైతం రక్తదానం చేసేలా చైతన్యపరుస్తున్నాడు. వైద్యాధికారులు ద్వారా రక్తదానం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన పొందిన గంగాప్రసాద్ వాటిని మిత్రులకు వివరిస్తూ వారందరిని రక్తదాతలుగా తీర్చిదిద్దుతున్నాడు. రక్తదానంపై ప్రజల్లో నెలకొని ఉన్న ఆపోహాలను, భయాందోళనలను తొలగిస్తూ రక్తదానం పై అవగాహన కల్పిస్తున్నాడు.
• *ఘన సన్మానం చేసిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పాటిల్*
రక్తదాన ప్రక్రియలో ఆదర్శంగా వ్యవహరిస్తున్న బీజేవైఎం ప్రతినిధి గంగా ప్రసాద్ను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పాటిల్ ఇటీవల ఘనంగా సన్మానించారు. ప్రత్యేకంగా అభినందించి జ్ఞాపికలను బహుకరించారు. రక్తదానంపై నెల కాని ఉన్న అపోహలను తొలగించేందుకు చేపడుతున్న చర్యలను ప్రశసించారు.