– వాగ్దాటితో రక్తి కట్టించిన పృచ్ఛకులు
• కవులకు ఉగాది పురస్కారాలు అందించిన ఆనందిత ఫౌండేషన్
బైంసా, ( శ్రీకరం న్యూస్): రెవెన్యూ డివిజన్ కేంద్రమైన భైంసాలోని వేదం తపోవనం హై స్కూల్లో శనివారం నిర్వహించిన అష్టావధానం తెలుగు భాషాభిమానులను అలరారించింది. ఆనందిత ఫౌండేషన్ చైర్మెన్ వాడేకర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అష్టావధాన కార్యక్రమంలో ఎం.వీ. పట్వర్ధన్ అవధానిగా కడారి దశరథ్ సంచాలకులుగా వ్యవహరించారు. ఇందులో పృచ్ఛకులు డా.కోవెల శ్రీనివాసాచార్యులు, దాసరి సాయన్న, జాదవ్ పుండలీకావ్ పాటిల్, పీసర శ్రీని వాస్ గౌడ్, బసవరాజు,కొండూరు పోతన్న, గంగుల చిన్నన్న, నల్ల రాంకిషన్ లు హజరయ్యారు. అష్టావధానం అద్యంతం అహుతులను విశేషంగా అకట్టుకుంది.చక్కటి ఛలోక్తులతో అసాంతం అసక్తికరంగా కొనసాగింది. తెలుగు భాషాపై అభిమానం పెంపొందించింది. ఆహుతులను మంత్రముగ్ధులను చేసి కట్టిపడేసింది. పృచ్చకులు డా. కోవెల శ్రీనివాస చార్యులు – నిషిద్దాక్షరి, దాసరి సా యన్న – సమస్య, జాదవ్ పుండలీశ్రావ్ పాటిల్ – దత్తపది, పీసర శ్రీనివాస్ గౌడ్- న్యాస్తాక్షరి, బ సవరాజు – ఆశువు, కొండూర్ పోతన్న – చందోభాషణం, గంగుల చిన్నన్న- అప్రస్తుత ప్రసంగం, నల్ల రాంకిషన్ – వర్ణణలు చక్కటి ప్రశ్నలు, వాగ్దాటితో రక్తి కట్టించారు. అష్టావధాన కార్యక్రము ముగిసిన అనంతరం ఆనందిత పౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మెన్ వాడేకర్ లక్ష్మణ్ కవులకు ఉగాది పురస్కారాలు అందించి ఘనంగా సన్మానించారు.. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగు భాషాభిమానులు, కవులు, రచయితలు, కళాకారులు అధిక సంఖ్యలో హజరయ్యాయి. తెలుగు భాషకు తేజం నింపేలా అష్టావధాన కార్యక్రమాన్ని నిర్వహించి కవులను ప్రోత్సహించేలా ఉగాది పురస్కారాలను అందించిన ఆనందిత ఫౌండేషన్ చైర్మెన్ వాడేకర్ లక్ష్మణ్ ను పలు సంస్థలు, సం ఘాలు ఘనంగా సన్మానించి అభినందించాయి. ఇందులో వేదం తపోవనం పాఠశాల చైర్మెన్ శ్రీని వాస్ రెడ్డి, సంస్కార్ పాఠశాల ప్రిన్సిపల్ ప్రకాష్, మనోరమ చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ డా. నగేష్, బార్ అసోసియేషన్ ప్రతినిధి సంతోష్, తపాస్ ప్రతినిధి రాజేశ్వర్లతో పాటు పలువురు పాల్గొ న్నారు.