– భైంసాకు సిద్ధం వివేకానంద(కుభీర్)
– ముథోల్ కు గన్ను నర్సారెడ్డి (పుస్పూర్)
– వేణుగోపాలచారి, నారాయణరావ్ పాటిల్ వర్గీయులకు దక్కిన పీఠాలు
భైంసా, (శ్రీకరం న్యూస్): సంవత్సర కాలంగా వాయిదా పడుతూ వస్తున్న భైంసా, ముథోల్ ఆత్మ కమిటీలు ఎట్టకేలకు ఖరారు అయి నట్లుగా తెలిసింది. భైంసా ఆత్మ కమిటీ చైర్మెన్ గా ముథోల్ మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావ్ పాటిల్ ప్రధాన అనుచరు డైన కుభీర్ గ్రామానికి చెందిన సిద్ధం వివేకానంద నియమితులైనట్లుగా తెలిసింది. ఇక ముథోల్ ఆత్మ కమిటీ చైర్మెన్ గా మాజీ కేంద్ర మంత్రి వర్యులు డా. సముద్రాల వేణుగోపాల చారికి నమ్మిన బంటుగానున్న లోకేశ్వరం మండలం పుస్పూర్ గ్రామానికి చెందిన గన్ను నర్సారెడ్డి నియమితులైనట్లుగా సమాచారం. జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క సిఫారసు మేరకు వ్యవసాయ శాఖాధికారులు భైంసా, ముథోల్ ఆత్మ కమిటీల నియమాకపు జాబితాను ఉ న్నతాధికారుల అనుమతి కోసం నివేదించినట్లుగా తెలి సింది . మంగళ, బుధవారాల్లో కమిటీల నియమాకపు ఉత్తర్వులు వెలువడనున్నట్లుగా తెలిసింది. ఒక్కో ఆత్మ కమిటీలో చైర్మెన్ తో పాటు 24 మంది డైరెక్టర్లు, ఏడీఏ, బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ తో కలిసి ఒక్కో కమిటీలో మొత్తం 27 మంది సభ్యులుంటారు. క మిటీల పదవీకాలం రెండు సంవత్సరాల పాటు కొనసాగనుంది.