Srikaram News
క్రైమ్తెలంగాణ

భైంసాలో వృద్ధ దంపతులకు బురిడికొట్టి రెండు తులాల బంగారు చైన్ ఆపహారణ

* నడుచుకుంటూ వెలుతున్న జంటను అధికారులమంటూ అడ్డగింత
* మెడలోని బంగారు చైన్ ను దాచుకోవాలని సూచన
* పేపర్లో ముడిచి పెట్టిస్తామని తీసుకొని మస్కా
* మట్టి పెట్టి పేపర్ అందించి బంగారు చైన్ తో ఉడాయింపు
* బాధిత వృద్ధులు కుంటాల మండలం అంబకంటివాసులు

బైంసా, (శ్రీకరం న్యూస్), రెవెన్యూ డివిజన్ కేంద్రమైన భైంసాలో కుంటాల మండలంలోని అంబకంటి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు రాజవ్వ, గోవింద్ లకు ముగ్గురు ఆగంతకులు బురిడి కొట్టించి రెండు తులాల బంగారు చైన్ ను అపహరించుకపోయిన సంఘటన చోటు చేసుకుంది. వృద్ధ దంపతులు తమ సమీప బందువు ఇంట్లో జరుగుతున్న శుభ కార్యక్రమంలో పాల్గోనేందుకు గాను మంగళవారం మధ్యాహ్నం వేళలో బస్సులో బైంసాకు వచ్చారు. స్థానిక పిప్రి కాలనీ బస్టాండ్ వద్ద బస్సు దిగి కాలనీ వైపు నడుచుకుంటూ వెలుతుండగా అక్కడి మార్గంలో ద్విచక్ర వాహనంపై కాపు కాచి ఉన్న ముగ్గురు ఆగంతకులు వృద్ధ జంటను ఆపి తాము అధికారులమంటూ మాట్లాడారు. చోరిలు అధికమైన దృష్ట్యా బంగారు చైన్ nu మెడలో నుంచి తీసివే సి లోపల పెట్టుకోవాలంటూ సూచించారు. అగంతకులలో ఒకరు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం తాను ధరించిన బంగారు చైన్, రెండు ఉంగరాలను తీసి ఇవ్వగా మిగతా ఇద్దరు అగంతకులు వాటిని పేపర్ పొట్లంలో వేసి ఇచ్చారు. వాటిని తీసుకొని వృద్ధ దంపతుల ముందు నుంచి మూడవ ఆగంతకుడు అక్కడి నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయాయి. ఇది చూసిన వృద్ధ దంపతులు నిజమని నమ్మి అగంతకులు చెప్పినట్టే చేసారు. వృద్ధురాలు రాజవ్వ తాను ధరించిన బంగారు చైన్ ను మెడలో నుంచి తీసివేయగా ఆగంతడొకరు తాను పేపర్ పోట్లంలో పెట్టి ఇస్తానని నమ్మించి వృద్దురాలి నుంచి బంగారు చైను ను తీసుకున్నారు. మరో అగంతకుడు వృద్ధ దం పతులను మాటల్లో పెట్టగా మిగతా అగంతకుడు బంగారు చైన్ ను దాచిపెట్టి ముందుగాను తాను సిద్ధం చేసి ఉంచుకున్న మట్టి పెట్టి చుట్టిన పేపర్ కవర్ ను అందించి సంచిలో వేసుకో వాల్సిగా సూచించారు. దీంతో వృద్ధురాలు అగంతకులు అందించిన మట్టి పేపర్ కవరును సంచిలో వేసుకొని నడుచుకుంటూ బంధువుల ఇంటి వైపు వెళ్లింది. ఇదే సమయంలో ఆ గంతకులు బైక్ పై అక్కడి నుంచి ఉడాయించారు. కొద్ది మేర దూరం వెళ్లిన అనంతరం వృద్ధుడు గోవింద్ పేపర్ పోట్లం తీసి బంగారు చైన్ వేసుకోవాల్సిందిగా భార్య రాజవ్వకు సూ చించారు. వెంటనే వృద్దురాలి పొట్లం విప్పి చూడగా అందులో బంగారు చైన్ కు బదులుగా మట్టి, చిన్నపాటి కంకర కనిపించడంతో ఖంగుతిని తాము మోసపోయినట్లుగు గుర్తించి లబోదిబోమన్నారు. రోదిస్తూ తాము మోసపోయిన వైనాన్ని బంధువులకు సమాచారం అందించారు. సంబంధిత సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటన స్థలికి చేరుకొని వృద్ధ దంపతుల నుంచి వివరాలు సేకరించారు. అగంతకుల అచూకి కోసం గాలింపు చర్యలను చేపట్టారు.

 

0Shares

Related posts

జాతీయ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు ఎంపికైన భైంసా వాసి

Srikaram News

భైంసా వాసికి రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్సలెన్స్ 2024 అవార్డు

Srikaram News

గడ్డేన్న వాగు ప్రాజెక్ట్ వరద గేట్లు నుంచి మరింత పెరిగిన అవుట్ ఫ్లో

Srikaram News

వాటర్ ఫాల్ లో గల్లంతై వైమానిక జవాన్ మృతి

Srikaram News

బాసర దుర్ఘటనలోని మృతుల్లో ముగ్గురు సొంత అన్నదమ్ములు

Srikaram News

రోడ్డు ప్రమాదంలో మహాగాం గ్రామవాసి దుర్మరణం

Srikaram News

Leave a Comment