– పంతం నెగ్గించుకున్న మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
– ఆయన వర్గీయులకే దక్కిన పాలక వర్గ పీఠం
– అఘమేఘాల మీద పూర్తయిన ప్రమాణ స్వీకారం
భైంసా (శ్రీకరం న్యూస్) ; గత ఏడాదిన్నర కాలంగా పెండింగ్ లో ఉంటున్న కుభీర్ వ్యవసాయ మార్కెట్ కమిటి పాలక వర్గ కమిటి నియమాకం ఎట్టకేలకు ఖరారైంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సోమవారం వెలువడ్డప్పటికి బుధవారం వరకు గోప్యతగా ఉంచారు కమిటి చైర్మన్ తో పాటు పాలక వర్గ సభ్యులుగా ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వర్గీయులకే చోటు దక్కింది. ఇటీవల భైంసా, ముథోల్ ఆత్మ కమిటి చైర్మన్లు గా మాజీ ఎమ్మెల్యేలు డా. ఎస్ వేణుగోపాల చారి, భోస్లే నారాయణ్ రావ్ పాటిల్ వర్గీయులకు దక్కగా, కుభీర్ మార్కెట్ కమిటి చైర్మన్, పాలక వర్గం మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వర్గీయులకు అవకాశం లభించింది. గత నాలుగు రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేసిన మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తమ వర్గీయులకు కట్టబెట్టెందుకు నెలకొన్న అవాంతరాలు, అడ్డంకులను తొలగించుకొని ఖరారు చేయించుకున్నారు. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పాలక వర్గాన్ని ఖరారు చేయించుకున్నట్టుగా సమాచారం.
హడావుడిగా పూర్తయిన ప్రమాణ స్వీకారం..
కుభీర్ వ్యవసాయ మార్కెట్ కమిటి పాలక వర్గం ప్రమాణ స్వీకారం బుధవారం మధ్యాహ్నాం హడావిడిగా చేపట్టారు. పాలక వర్గ సభ్యులచే కుభీర్ మార్కెట్ కమిటి కార్యదర్శి రాజేశ్వర్ ప్రమాణ స్వీకారం నిర్వహింపజేశారు. అధ్యక్షులుగా జి. కళ్యాణ్, వైస్ చైర్మన్ గా ఎస్.కే హైమద్, సభ్యులుగా వెన్నెల సతీష్, గోనే జ్ఞానేశ్వర్, చర్ల విఠల్, ఆకుల వెంకటేష్, రాథోడ్ అరుణ్ కుమార్, గుర్రపు సత్తవ్వ, ప్రహ్లాద్, బెంద్రి సత్యనారాయణా, జిడ్డూ ఓంకార్, సర్ధార్ రాజాసింగ్, అరుగుల విఠల్, బి. రమేష్ లు కమిటి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. అనంతరం కార్యవర్గ సభ్యులందరిని ఘనంగా సన్మానించారు.