– అభిమానుల భావోద్వేగ పోస్టులు
– మీ కోసం సదా సిద్ధమంటూ కొందరు
– మీ వెంటే సైన్యమై నడుస్తామని మరి కొందరు
– బంగారం కోసం వజ్రం దూరమయ్యిందని ఇంకొందరూ
– అధిష్టానం తీరును ఎండగడుతూ అధిక పోస్టులు
– మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హల్చల్ చేస్తున్న హెచ్చరికలు
బైంసా, (శ్రీకరం న్యూస్): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక వ్యవహారంతో మనస్థాపం చెందిన పార్టీకి రాజీనామ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతుదారుల పోస్టులతో సోషల్ మీడియా హీటెక్కుతోంది. రెండు రోజులుగా ఇక్కడి ప్రాంత సోషల్ మీడియాలో రాజాసింగ్ ట్రెండింగ్ గా మారాడు. బీజేపీతో పాటు అనుబంధ సంఘాలకు చెందిన పలువురు శ్రేణులు, హిందుత్వ సంఘాలకు చెందిన పలువురు ప్రతినిధులు రాజాసింగ్ కు అనుకూలంగా పెడుతున్న పోస్టులు సందడి చేస్తున్నాయి. ఆయనపై తమకున్న అభిమానాన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ చాటుకుంటున్నారు. ఇక్కడి ప్రాంతంలో ఆయనకు ఇంతమంది అభిమానులు న్నారనే విషయం సోషల్ మీడియా ద్వారా తేటతెల్లమవుతుండటంతో స్వపక్ష ప్రతినిధులతో పాటు విపక్ష శ్రేణులు నివ్వె రపోతున్నాయి. ప్రధానంగా యువకులు అధికంగా రాజాసింగ్ కు మద్దతుగా, అనుకూలంగా హల్చల్ చేస్తున్నారు. వాట్సప్ వేదికగా స్టే టస్, గ్రూప్ లలో అధికంగా రాజాసింగ్ పోస్టులే దర్శనమిస్తున్నాయి. రాజీనామ చేసిన సందర్భంగా రాజాసింగ్ మీడియా తో అవేదనభరితంగా మాట్లాడిన వీడియో అధిక మొత్తంలో సర్క్యులేట్ అయ్యింది. కొందరూ అభిమానులు బావోద్వేగాలతో పోస్టులు పెడుతూ పార్టీ తీరును పరోక్ష వ్యాఖ్యలతో తూర్పారపడుతున్నారు. బంగారం కోసం వేతికి వజ్రాన్ని దూరం చేసారని పార్టీ నూతన అధ్యక్షుడు రాంచందర్రావ్, రాజాసింగ్ ఫోటోలతో కూడిన పోస్టు అందరని ఆలోచింపచేస్తోంది. కట్టర్ హిందూవాదిని పక్కకు తప్పుకునేలా కుట్రపూరితంగా వ్యవహరించారనే పోస్టు ద్వారా అధిష్టానపు తీరును కొందరూ బహాటంగానే విమ ర్శిస్తున్నారు. నీ వెంటే మేముంటాం… నడుస్తాం అంటూ పోస్టులు అధిక మొత్తంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇంకొందరూ ఊపు మీదనున్న పార్టీని ఫ్లాప్ వైపు నడిపించేలా నిర్ణయం తీసుకున్నారంటూ అధిష్టానం వైఖరిని ఎండగడుతూ రాజాసింగ్ దూరమవ్వడంతో కోలుకోలేని నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరకల పోస్టులు పెట్టారు. మరికొందరూ మీరు పార్టీలో ఉన్నా.. లేకున్నా మీ వెంటే మేమంతా సైన్యంగా కదిలి వస్తామంటూ పోస్టులు పెడుతూ రాజాసింగ్ పై తమకున్న వీరాభిమాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి పోస్టులతో సోమవారం సోషల్ మీడియాలో ప్రారంభమైన రాజాసింగ్ ట్రెండింగ్ మంగళవారం మరింత అధికమయ్యింది.