@ బేటికి సారథ్యం వహించిన డా.కిరణ్ కోమ్రేవార్
@ పాల్గొన్న కుంటాల,కుభీర్, బాసర మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు
@ పార్టీకి పూర్వవైభవం తీసుకరావాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశా, నిర్దేశం
బైంసా, (శ్రీకరం న్యూస్)
సంవత్సరన్నర కాలంగా అంతంత మాత్రంగానే రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్న బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ పిప్పెరవార్ కృష్ణ మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేబీఆర్ తో కీలక బేటి జరిపారు. పార్టీ ముదోల్ నియోజక వర్గ సమన్వయ కమిటీ ప్రతినిధి డా. కిరణ్ కోమ్రేవార్ సారథ్యంలో కుంటాల, కుభీర్, బాసర మండలాల పార్టీ అధ్యక్షులు పడకంటి దత్తు, ఎన్నిల అనిల్ కుమార్, గంగా శ్యామ్ లతో కలిసి పిప్పెరవార్ కృష్ణ మధ్యాహ్నం వేళలో కేటీఆర్ ను కలిసారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత కేటీఆర్ ముథోల్ నియోజక వర్గ సమన్వయ కమిటీ ప్రతినిధితో పాటు మూడు మండలాల పార్టీ అధ్యక్షులు, నియోజక వర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ ప్రతినిధులతో ప్ర త్వేకంగా మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సత్తా చాటేందుకు, పార్టీకి నియోజక వర్గ పరిధిలో పూర్వ వైభవం తీసుకవచ్చేందుకు గాను ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. పార్టీ పటిష్టతకు అనుసరించాల్సిన పలు అంశాలపై దిశ నిర్దేశం చేసారు. త్వరలోనే నియోజక వర్గాల వారీగా పార్టీ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. అప్పటి వరకు పార్టీ శ్రేణులన్నీంటిని ఏకతాటిపైకి తీసుకవచ్చి బీఆర్ఎస్ ను పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
# చర్చనీయాంశంగా పిప్పెరవార్ కృష్ణ బేటి….
స్థానిక సంస్థల ఎన్నికల వాతవరణం జోరందుకుంటున్న వేళ పిప్పెరవార్ కృష్ణ పార్టీ అధినేతతో బేటి అవ్వడం ముధోల్ నియోజక వర్గ పరిధిలో తీవ్ర చర్చకు దారితీసింది. ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ల్ రెడ్డి ప్రధాన అనుచరుడిగానున్న పిప్పెర్వార్ కృష్ణ గత కొంతకాలంగా రాజకీయ కార్యకలాపాలు నామమాత్రంగా నిర్వహిస్తున్నాడు. మారిన రాజకీయ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరినప్పటికి పిప్పెరవార్ కృష్ణ మాత్రం పార్టీని వీడకుండా అలానే కొనసాగాడు . అయితే ఇటీవల ముదోల్ కేంద్రములో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రధాన నాయకుడు జోగు రామన్న సంబంధిత కార్యక్రమంలో పిప్పెరవార్ కృష్ణతో ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూ చించారు. దీనికి తోడు ఇటీవల కేటీఆర్ సైతం ఆయనతో ఫోన్ లో మాట్లాడి ఒకసారి హైదరాబాద్ కు వచ్చి కలిసి వెళ్లాలని సూచించారు. దీంతో మంగళవారం పార్టీ ముథోల్ నియోజక వర్గ సమన్వయ కమిటీ ప్రతినిధి డా. కిరణ్ కొమ్రేవార్ సారధ్యంలో పిప్పెరవార్ కృష్ణ కేటీఆర్ తో బేటీ అయినట్లుగా తెలిసింది. ఈ సందర్భంగా తానూర్ జడ్పీటీసీ పార్టీ అభ్యర్థిత్వంపై సైతం జరిగినట్లుగా సమాచారం. అక్కడి నుంచి పోటీకి దిగాలని ఆసక్తితోనున్న పిప్పెరవార్ కృష్ణకు సానుకూల స్పందన లభించినట్లుగా తెలిసింది.