@ భైంసాలోని నర్సింహనగర్ కాలనీలో ఘటన
@ నిలిచిన విద్యుత్ సరఫరా, రాకపోకలకు ఆటంకం
@ దెబ్బతిన్న రెండు కార్లు, ఒక బైక్
@ అర్ధరాత్రి ఘటన జరుగడంతో తప్పిన ముప్పు
బైంసా, (శ్రీకరం న్యూస్) : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దాటికి బైంసాలోని నర్సింహనగర్ కాలనీ పరిధిలో గురువారం అర్ధరాత్రి పెద్ద ప రిమాణంతోనున్న చెట్టు ఒకటి కూకటి వెళ్లతో సహా రోడ్డుపై కుప్పకూలిపోయింది. చెట్టు కొమ్మలు పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై పడటంతో వాటి దాటికి అక్కడి ప్రాం తంలోని విద్యుత్ స్తంభం ఒకటి విరిగిపోయి రోడ్డు పై పడిపోయింది. అర్థరాత్రి వేళలో ఘటన చోటు చేసుకోవడంతో పెను ముప్పు తప్పింది. నిత్యం జనాలు, వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే నర్సింహనగర్ పరిధిలో దినం వేళలో సంబంధిత ఘటనలు చోటు చేసుకుంటే పరిస్థితి వేరేలా ఉండేంది. స్వల్ప వ్యవధి లోనే రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి. విద్యుత్ స్తంభం విరిగిపడటంతో నర్సింహనగర్ కాలనీ పరిధితో పాటు పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో అర్థ రాత్రి సమయం నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక అక్కడి ప్రాంతంలో చెట్ల కొమ్మలు పడటంతో అక్కడి ప్రాంతంలో పార్కింగ్ చేసిన రెండు కార్లు, ఒక బైక్ దెబ్బతింది. ఇదే క్రమంలో ఒకే రోడ్డు మార్గంలో విద్యుత్ స్తంభం, చెట్టు పడిపోవడంతో బస్టాండ్ నుంచి నర్సింహనగర్ ప్రాంతం మీదుగా ఇతర కా లనీలకు రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. జనాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు చెపట్టారు. మున్సిపల్ అధికార యంత్రాంగం రోడ్డుపై అడ్డంగా కుప్పకూలిన చెట్టును తొలగించే చర్యలు చేపట్టగా విద్యుత్ శాఖాధికారులు విరిగిన విద్యుత్ స్తంబాన్ని తొలగించి అక్కడి స్థానంలో కొత్త విద్యుత్ స్తం బాన్ని బిగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారు.