– భైంసా సేవాలాల్ చౌక్ సమీపంలో ఘటన
– బస్సు–భైక్ ఢీ కొట్టుకోవడంతో ప్రమాదం
భైంసా (శ్రీకరం న్యూస్) ; భైంసా–బాసర ప్రధాన రహదారిలోని పట్టణ సరిహద్దు ప్రాంతంలో గల సేవాలాల్ చౌక్ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కుభీర్ మండలం సిర్పెల్లి తాండకు చెందిన ఆడే నరేష్ (45) మృతి చెందాడు. ఆడే ముథోల్ నియోజకవర్గ కేంద్రంలో ఆశ్రమ పాఠశాలలో వ్యాయమ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాడు. భైంసాలోని ఖాన్ ఆటో నగర్ వైపు నుంచి ముథోల్ ఆశ్రమ పాఠశాలకు ద్విచక్రవాహానంపై వెళ్తున్న ఆడే నరేష్, నిజామాబాద్ వైపు నుంచి భైంసాకు వస్తున్న బస్సు సేవాలాల్ చౌక్ సమీపంలో ఢీ కొట్టుకోవడంతో ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో అపస్మారక స్థితికి చేరుకున్న వ్యాయమ ఉపాధ్యాయుడు ఆడే నరేష్ ను 108 అంబులెన్స్ లో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా తెలిసింది. సమాచారం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.