– ఇంట్లో బ్రష్ చేస్తుండగా కుప్పకూలి కిందపడిపోయిన వైనం
– ఆసుపత్రికి తరలించేలోపు మార్గమద్యలో మృతి
– శస్త్ర చికిత్సల నిర్వహణలో రెండు దశాబ్దాలకు పైగా సేవలు
బైంసా, (శ్రీకరం న్యూస్):
మున్సిపల్ కేంద్రమైన భైంసాలోని ఏరియా ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న పిట్ల శ్రీనివాస్ మంగళవారం ఉదయం ఆకస్మి కంగా మృతి చెందారు. పట్టణంలోని రాజీవ్నగర్లో లోని నివాస గృహం లో శ్రీనివాస్ బ్రష్ చేసుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలి కిందపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటహూటిన ఆయనను ఇక్కడి నర్సింహ నగర్ కాలనీ పరిధిలో గల ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు శ్రీనివాస్ మృతి చెందినట్లుగా వెల్లడించారు. ఈ క్రమంలో ఆసుపత్రికి తరలించే లోపు మార్గ మధ్యలోనే ఆయన మృతి చెందినట్లుగా తెలిసింది. గుండెపోటు లక్షణాలతో మృతి ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం.
జిల్లాలోని ప్రధాన సుపత్రిలన్నీంటిలోనూ విధుల నిర్వహణ…..
పిట్ల శ్రీనివాస్ జిల్లాలోని బైంసా, నిర్మల్, ఖానాపూర్, ముథోల్ ప్రభుత్వ ఆసుపత్రులలో వివిధ విభాగాలలో విధులు నిర్వహించాడు. బైంసాలోని ఏరియా ఆసుపత్రిలో ఎక్కువ కాలం పని చేసాడు. ఇక్కడి ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో అసిస్టెంట్ అనిర్వచనీయమైన సేవలు అందించాడు. ఆసుపత్రిలో జరిగే ప్రతి ఆపరేషన్ నిర్వాహణలో వైద్యులకు బాధ్యతాయుతమైన విధానాల ద్వారా సహాయకుడిగా సహకరించే వాడు. వైద్యులు ధియేటర్కు వచ్చే లోపు శస్త్ర చికిత్స నిర్వాహణకు అవసరమైన అన్ని పనులను పూర్తి చేసి వ్యవస్థను సిద్ధం చేసి ఉంచేవాడు. విధుల నిర్వాహణలో ఇక్కడి ప్రాంత ప్రముఖలందరిచే మన్ననలను పొందాడు. పిట్ల శ్రీనివాస్ మృతి పట్ల ముథోల్ ఎమ్మెల్యే, ఏరియా ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ చైర్మెన్ పవార్ రామరావ్ పాటిల్, సూపరిండెంట్ డా. కాశీనాథ్, ముథోల్ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డా. అనిల్ కుమార్ జాదవ్ తో పాటు బైంసా ఏరియా ఆసుపత్రి వైద్యాధికారుల బృందం, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుడు శ్రీనివాస్ కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.