Srikaram News
క్రైమ్తెలంగాణ

స్కూటి డిక్కీ నుంచి రూ.5 లక్షల అవహరణ

– అమెరికా నుంచి తండ్రికి డబ్బులు పంపిన కూతురు
– బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకున్న తండ్రి
– స్కూటి డిక్కీలో పెటుకొని ఇంటికి పయనం
– మద్యలో భోజనం కోసం స్కూటి నిలిపివేత
– హోటల్ వెళ్లి వచ్చే లోప డబ్బులు చోరి
– బాధితుడు ముధోల్ మండలం ఎడిబిడ్ నివాసి

బైంసా, (శ్రీకరం న్యూస్): మున్సిపల్ కేంద్రమైన బైంసా పట్టణంలో సోమవారం పట్టపగలే చోరి ఘటన చోటు చేసుకుంది. ముథోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామానికి చెందిన బొంబోతుల ఆనంద్ అమెరికాలో ఉంటున్న తన కూతురు పంపిన డబ్బులను బ్యాంక్ నుంచి డ్రా చేసుకొని వెళ్తుండగా ఘటన జరిగింది. ఉదయం వేళలో ఎడ్ బిడ్ నుంచి స్కూట్ పై బైంసాకు వచ్చిన బి. ఆనంద్ స్థానిక యూనియన్ బ్యాంక్ నుంచి రూ.5 లక్షలు డ్రా చేసుకున్నాడు. అనంతరం వాటిని స్కూటీ డిక్కిలో పెట్టుకొని ఇంటికి బయలు దేరారు. ఇదే సమయంలో ఆకలి వేయడంతో పట్టణ సరిహద్దులోనున్న సాయి లక్ష్మీ బార్ వద్ద తన స్కూటీని నిలిపి భోజనం కోసం గాను లోనికి వెళ్ళాడు. ఇదే సమయంలో ఇద్దరు ఆగంతకులు ద్విచక్ర వాహనంపై బార్ వద్దకు చేరుకున్నారు. ఇందులో నుంచి ఒకడు స్కూటీ వద్దకు చేరుకొని డిక్కి తెరిచి అందులో నుంచి డబ్బులు ఆపహరించుకపోయాడు. భోజనం ముగించుకొని తిరిగి తన వాహనం వద్దకు రాగా స్కూటి డిక్కీ తెరువబడి ఉండగా చూసి కంగారు చెంది పూర్తిగా తెరిచి చూడగా అందులో బ్యాంక్ నుంచి డ్రా చేసి పెట్టిన డబ్బులు కనిపించకుండా పోయాయి. డబ్బులు చోరికి గురయినట్లుగా గుర్తించిన బాధితుడు వెంటనే బార్ నిర్వాహకులకు సంబంధిత చోరి విషయాన్ని వివరించారు. అనంతరం పోలీసు స్టేషన్ కు వెళ్లి సంబంధిత విషయాన్ని వివరించారు. టౌన్ సీఐ గోపినాథ్ ఆధ్వర్యంలో పోలీసులు చోరి ఘటన చేదించేందుకు గాను సీసీ పుటేజీ పరిశీలన చర్యలు చేపట్టారు. అయితే దుండగులు బాసర మార్గం వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

0Shares

Related posts

గడ్డేన్న వాగు ప్రాజెక్టులోకి మరింతగా పెరిగిన ఇన్ ఫ్లో

Srikaram News

ఇన్ స్పైర్ మేళాలో సత్తా చాటిన బైంసా కేజీబీవీ విద్యార్థులు

Srikaram News

గడ్డెన్న ప్రాజెక్టు 3 వరద గేట్ల ఎత్తివేత

Srikaram News

బైంసా – పార్డీ రోడ్డు మార్గంలో నిలిచిన రాకపోకలు

Srikaram News

గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి 20 వేల క్యూసెక్కులకు తగ్గిన ఇన్ ఫ్లో

Srikaram News

భైంసా డివిజన్ యాత్రీకుల బస్సుకు అగ్ని ప్రమాదం

Srikaram News

Leave a Comment