– బాసర అమ్మవారి దర్శనాంతరం ఉద్యోగ బాధ్యత స్వీకరణ
– బాధ్యతలు అప్పచెప్పిన అర్డీవో కోమల్ రెడ్డి
– స్వాగతం పలికిన రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది
బైంసా, (శ్రీకరం న్యూస్) : బైంసా సబ్ కలెక్టర్గా అజ్మీరా సాంకేత్ కుమార్ గురువారం ఉ ద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఉదయం వేళలో హైదరాబాద్ నుంచి ఉద్యోగ బాధ్యతల స్వీకరణ కోసం తరలివచ్చాడు. మార్గ మధ్యంలో బాసర అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. అక్కడి నుంచి బైంసాలోని కార్యాలయానికి ఉద్యోగ బాధ్యతల స్వీకరణ కోసం తరలివచ్చాడు. ఆర్డీవో కోమల్ రెడ్డి, బైంసా తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ల నేతృత్వంలో అర్డీవో, తహసీల్ కార్యాలయాల అధికారులు, సిబ్బంది సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్కు పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో అర్డీవో కోమల్ రెడ్డి నుంచి సబ్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అజ్మీరా సాంకేత్ కు మార్ కు నియోజక వర్గ పరిధిలోని ఆయా మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులు మర్యాద పూర్వకంగా కలిసారు. ఉద్యోగ సంఘాల ప్రతి నిధులు సైతం సబ్ కలెక్టర్ను కలిసారు.