– మురికికాలువలో శిశువు పిండం
– బయటకు తీసి ఆసుపత్రికి తరలింపు
– 5 నుంచి 6 నెలల వయస్సుగా గుర్తింపు
బైంసా, (శ్రీకరం న్యూస్) : మున్సిపల్ కేంద్రమైన భైంసాలో గురువారం అమాన వీయ ఘటన వెలుగు చూసింది. స్థానిక నర్సింహనగర్ కాలనీ ప్రాంతంలోని వేదం హైస్కూల్ పక్కన, రేయిన్బో హైస్కూల్ ముందరి భాగంలోని మురికి కాలువలో శిశువు పిండం ఒకటి లభ్యమయ్యింది. గుర్తు తెలియని వ్యక్తులు శిశువు పిండాన్ని మురికి కాలువలో పారవేసినట్లుగా తెలిసింది. మధ్యాహ్నం వేళలో అక్కడి మార్గం మీదుగా వెలుతున్న కొందరు మురికి కాలువలోని పిండాన్ని గుర్తించడంతో ఘటన వెలుగు చూసింది. సంబంధిత సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు, మున్సి పల్ అధికారులు, సిబ్బందితో కలిసి మురికి కాలువలో పారవేయబడి ఉన్న శిశువు పిండాన్ని బయటకు తీసారు. అక్కడి నుంచి ఏరియా ఆసుపత్రిలోని పోస్టుమార్టం గదికి తరలించారు. శిశువు పిండం ఐదు నుంచి ఆరు నెలల వయసు ఉన్నట్లు తెలిసింది. మురికి కాలువలో శిశువు పిండం లభ్యమవ్వడంతో భైంసాలో సంచలనం రేపింది.