– నిలిచి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని స్క్యూటీ ఢీ కొట్టుకోవడంతో ఘటన
– మృతుడు భైంసా మండలం పెండ్ పెల్లి వాసి
భైంసా (శ్రీకరం న్యూస్) ; భైంసా–నిర్మల్ ప్రధాన రహదారి మార్గంలో మాటేగాం గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు ఒకరు మృత్యువాత పడ్డారు. పెండ్ పెల్లి గ్రామానికి చెందిన యశ్వంత్ (25), కుంసర గ్రామానికి చెందిన విలాస్ మిత్రులైన వీరిరువురు భైంసా నుంచి పెండ్ పెల్లి వైపు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. స్క్యూటీపై వెళ్తున్న వీరిద్దరు మాటేగాం గ్రామ సమీపంలో రోడ్డుపై నిలిచి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీ ఢీ కొట్టుకోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో స్క్యూటీ నడుపుతున్న యశ్వంత్, విలాస్ లు తీవ్రగాయాలపాలయ్యారు. ఘటన స్థలి నుంచి క్షతగాత్రులను భైంసా ఏరియా హాస్పిటల్ కు తరలిస్తుండగా అపస్మారక స్థితికి చేరుకున్న యశ్వంత్ మార్గమధ్యలోనే మృతి చెందారు. భైంసా రూరల్ పోలీసులు ప్రమాద ఘటనపై వివరాలు సేకరించారు.