– 15,416 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
– 8వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో
భైంసా, (శ్రీకరం న్యూస్ ) ; మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా గడ్డెన్న ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలో శుక్రవాకం ఉదయం వేళలో 1250 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, మధ్యాహ్నాం సమయానికి క్రమక్రమంగా ఇన్ ఫ్లో పెరిగి 15,400 క్యూసెక్కులకు చేరుకుంది. ఈ క్రమంలో గురువారం ప్రాజెక్టు నీటి మట్టం 357.9 మీటర్లు, 1.384 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా, అధిక మొత్తంలో వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నీటి మట్టం నీటి నిల్వలు పెరిగాయి. మధ్యాహ్నం సమయానికి 15వేల క్యూసెక్కుల వరద నీటి చేరికతో ప్రాజెక్టు నీటి మట్టం 358.4కి ఏకబాకింది. వరద నీటి చేరిక పరిస్థితిని అంఛనా వేసిన ప్రాజెక్టు అధికారులు, ఎమ్మెల్యే రామరావ్ పాటిల్ చేతుల మీదుగా రెండు వరద గేట్లను ఎత్తివేసి దిగువకు 8వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇన్ ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో వరద గేట్ల ద్వారా నీటి విడుదల సైతం పెంచనున్నట్లుగా ప్రాజెక్టు నిర్వాహన అధికారులు వెల్లడించారు. ఈ సీజన్ లో మొదటి సారిగా ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తివేయడంతో గడ్డెన్న ప్రాజెక్టు సందర్శకుల తాకిడి మొదలైంది. మధ్యాహ్నాం వేళ నుంచి భైంసా వాసులతో పాటు సమీప ప్రాంతాలకు చెందిన వారు గడ్డెన్న ప్రాజెక్టు సందర్శనకు తాకిడి పెరిగింది.