– వంతెన పై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు
– రాకపోకలు నిలిపివేసిన పట్టణ సీఐ గోపినాథ్
– బైపాస్ రోడ్డు వంతెనకు ఇరువైపుల పోలీసు బందోబస్తు
బైంసా, (శ్రీకరం న్యూస్) : గడ్డేన్న ప్రాజెక్టు వరద నీటి ప్రభావంతో సుద్దవాగు పరివాహక ప్రాంతంలో ముంపు ప్రభావం మొదలైంది. గడ్డెన్న ప్రాజెక్టులోకి 10,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నిర్వాహణ అధికారులు 5 వరద గేట్లను ఎత్తి సుద్దవాగులోకి 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో సుద్దవాగులో వరద నీరు ఉదృతితో ప్రవహిస్తోంది. పరివాహక ప్రాంతమంతా జలమయమ వుతోంది. ఇందులో భాగంగానే సుద్దవాగు బైపాస్ రోడ్డు వంతెన పైనుంచి గడ్డెన్న ప్రాజెక్టు వరద నీరు ఉదృతితో ప్రవహిస్తుంది. ఈ క్ర మంలో బైపాస్ రోడ్డు వంతెన నీటమునిగిపోయి, పై భాగం నుంచి వరద నీరు ప్రభావం జోరుగా కొనసాగుతోంది. బైంసా టౌన్ సీఐ గోపినాథ్ బైపాస్ రోడ్డు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. బైపాస్ రోడ్డుకు ఇరువైపుల బందోబస్తును ఏర్పాటు చేసి రాకపోకలను స్తంభింపజేసి ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అంతే కాకుండా బైపాస్ రోడ్డు వంతెన సమీప ప్రాంతా ల్లోని వ్యాపారాలు, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులకు సమాచారం అందించి ముంపు బారిన పడకుండా ఉండేందుకు గాను సురక్షిత ప్రాం తాలకు తరలివెళ్లాలని సూచించారు.