Srikaram News
క్రైమ్తెలంగాణ

ఒక రోజు వ్యవధిలో చైన్ స్నాచింగ్ కేసును చేదించిన లోకేశ్వరం పోలీసులు

– సీసీ పుటేజీ ఆధారంగా నేరస్తుడి గుర్తింపు, పట్టివేత
– అవహరించిన బంగారు గొలుసు. వినియోగించిన బైక్ స్వాధీనం
– నేరస్తుడు ముధోల్ మండలం ఆష్ట గ్రామవాసి

బైంసా (శ్రీకరం న్యూస్) లోకేశ్వరం మండల పరిధిలోని అబ్దులాపూర్ గ్రామ శివారులో గురువారం చోటు చేసుకున్న చైన్ స్నాచింగ్ కే సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అక్కడి ఎస్సై అశోక్ కుమార్ 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. సీసీ పుటేజీ ఆధారంగా చైన్ స్నాచింగ్ కు పాల్పడిన నేరస్తుడిని గుర్తించి చాకచాక్యంగా పట్టుకున్నారు. నేరస్తుడి నుంచి అపహరించిన బంగారు గొలుసుతో చైన్ స్నాచింగ్ కు వినియోగించిన బైక్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు శనివారం నేరస్తుడిని రిమాండ్కు తరలించారు. బైంసా ఏఎస్సీ అవినాష్ కుమార్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి చైన్ స్నాచింగ్, చేదించిన వివరాలను వెల్లడించారు. లోకేశ్వరం మండలం వాస్తాహర్కు చెందిన మేకల యమున అబ్దుల్లాపూర్ గ్రామ శివారులో పశువులను మేపుతుండగా అక్కడికి వచ్చిన నేరస్తుడు మాయమాటలు చెప్పి ఆమె మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చే సుకున్న లోకేశ్వరం ఎస్సై అశోక్ కుమార్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలీస్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, సాయిప్రశాంత్, లక్ష్మణ్ తో కలిసి కేసును చేదించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి చైన్ స్నాచింగ్ కు పాల్పడిన నిందితుడు ఆష్టా గ్రామానికి చెందిన పిప్పెర విజయ్ గా గుర్తించారు. గాలింపు చర్యలు చేపట్టి నేరస్తుడిని పట్టుకు ఉన్నారు. అతని వద్ద నుంచి అపహరించిన గొలుసు, వినియోగించిన ద్విచక్రవాహానాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. 24 గంటల వ్యవధిలో కేసును చేదించిన ఎస్సై అశోక్ తో పాటు పోలీసు కానిస్టేబుళ్ల బృందానికి ఎస్పీ డా. జానకి షర్మిలా, ఏఎస్సీ అవినాష్ కుమార్లు అభినందించినట్లుగా ముథోల్ సీఐ మల్లేష్ తెలిపారు.

0Shares

Related posts

భైంసాలో అమానవీయ ఘటన

Srikaram News

బాసర దుర్ఘటనలోని మృతుల్లో ముగ్గురు సొంత అన్నదమ్ములు

Srikaram News

బీజేపీ పార్టీని వీడే ప్రసక్తే లేదు..

Srikaram News

టీజీఎల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం

Srikaram News

బాసర గోదావరి నదిలో మునిగి ఐదుగురు యువకుల మృతి

Srikaram News

మృతదేహల తరలింపుకు అంబులెన్స్ సమకూర్చిన భైంసా రాజస్థానీయులు

Srikaram News

Leave a Comment