– వరద ముంపు పొంచి ఉన్న ప్రాంతాల్లో పర్యటన
– పడవలు, లైవ్ జాకెట్లు, అత్యవసర చికిత్స సామాగ్రిలతో సిద్ధం
బైంసా (శ్రీకరం న్యూస్): జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు గాను ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. ముంపు బెడద పొంచి ఉ న్న ప్రాంతాల్లో పర్యటనలు చేపట్టి నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. శనివారం ఎన్డీఆర్ఎఫ్ జి ల్లా కమాండర్ అమర్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని ఎన్డీఆర్ఎఫ్ బృందం ముంపు బెడద గల ప్రాంతా ల్లో పర్యటించింది. ఉదయం వేళలో భైంసాకు వచ్చిన బృందం సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, త హసీల్దార్ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్ తో బేటీ అయ్యారు. గడ్డెన్న ప్రాజెక్టు వద్ద సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ తో కలిసి ప్రాజెక్టు నిర్వాహణ అధికారులతో వరద పరిస్థితిపై నిర్వ హించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ముంపు బెడద ఉన్న భైంసా పట్టణంలోని రాహుల్ నగర్, సాయంత్రం వేళలో ఖాన్ ఆటో నగర్, ఇతర ప్రాంతాల్లో పర్యటించి అప్రమత్తం చేశా రు. ఎలాంటి సహాయ చర్యలకైనా ఎన్డీఆర్ఎఫ్ బృందం అన్ని విధాలుగా సన్నద్ధతతో సిద్ధంగా ఉందని ఎన్డీఆర్ఎఫ్ బృందం జిల్లా కమాండర్ అమర్ ప్రతాప్ సింగ్ ముంపు బెడద ప్రాంతాల్లోని ప్రజలకు వి వరించారు. అవసరమైన పక్షంలో అన్ని విధాలుగా రక్షణ చర్యలు చేపట్టేందుకు తామందరం సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ముంపు బారిన పడకుండా ఉండేందుకు అప్రమత్తతో ఉండాలని సూ చించారు. ముంపు బారిన పడితే సత్వరమే సమాచారం అందిస్తే తాము అన్ని విధాలుగా రక్షణ చ ర్యలు చేపడుతామని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పడవలు, లైవ్ జాకెట్లు, అత్యవసర చికిత్స సామాగ్రిలతో సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.