– నీట మునిగిన గుండెగాం వంతెన
– పల్సికర్ రంగారావు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో పెరుగుతున్న ముంపు ముప్పుబైంసా (శ్రీకరం న్యూస్ ): మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల భైంసా ప్రాంతంలో వరద సమస్యలు పెరుగుతున్నాయి. ఇప్పటికే గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టుకు సంబంధించిన ఐదు వరద గేట్లు ని ఎత్తివేసి సుద్ధ వాగులోకి 20వేల క్యూసెక్కుల వరకు నీటిని వదిలి పెట్టారు ఇదే క్రమంలో మహారాష్ట్రలోని భారీ వర్షాల మూలంగా ఇక్కడి ప్రాంతంలోని గుండెగాo గ్రామానికి ముంపు బెడద మళ్లీ పునరావృతమైంది మహారాష్ట్రలోని అధిక వర్షాల మూలంగా రంగారావు ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది.దీంతో గుండెగాo వంతెన వద్ద అధిక మొత్తంలో పల్శీకర్ రంగారావు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ భారీగా నిలవడంతో గుండెగాము వంతెన నీట మునిగిపోయింది. ఈ కారణంగా బైంసా – పార్డీ మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇక పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ గుండెగామ్ గ్రామoలో చొచ్చుక వస్తుండడంతో వస్తుండడంతో గ్రామస్తులు ముంపు బెడదతో ఆందోళన చెందుతున్నారు.

previous post