– నిన్న 10,500 క్యూసెక్కులు, నేడు 13,900 క్యూసెక్కులు
– ఐదు వరద గేట్ల ద్వారా సుద్దవాగులోకి కొనసాగుతున్న నీటి విడుదల
– మహారాష్ట్రలో జోరు వానలతో మరింత పెరుగనున్న ఇన్ ఫ్లో
భైంసా (శ్రీకరం న్యూస్ ): మహారాష్ట్రలో కురుస్తున్న జోరు వానలతో గడ్డేన్న వాగు ప్రాజెక్టులోకి వరద నీటి చేరిక పెరుగుతోంది. శనివారం ప్రాజెక్టులోకి 10,500 క్యూసిక్కుల వరద నీరు వచ్చి చేరగా ఆదివారం మరో 3400 క్యూసెక్కుల వరద నీరు చేరిక పెరిగి మొత్తం 13,900 ఇన్ ఫ్లో కొనసాగుతోంది. అయితే శనివారం 10500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగిన నేపథ్యంలో ప్రాజెక్టు నిర్వాహణాధికారులు ఐదు వరద గేట్లను ఎత్తివేసి సుద్దవాగులోకి 20 వేల క్యూసెక్కుల వరద నీటిని వదిలిపెట్టారు. ఈ క్రమంలో ప్రాజెక్టు నీటిమట్టం 358.4 మీటర్ల నుంచి 358.2 మీటర్లకు తగ్గింది. అయితే ఈ కారణంగా ఆదివారం ఇన్ ఫ్లో పెరిగినప్పటికీ 5 వరద గేట్ల నుంచి నీటి వదిలేతను తగ్గించారు. శనివారం 20,000 క్యూసెక్కుల ఉండగా, ఆదివారం ఉదయం నుంచి 6100 క్యూసెక్కుల నీటి వదిలేవేతను తగ్గించి ప్రస్తుతం 13,900 క్యూసెక్కులకు నీటిని వదిలేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 13,900 క్యూసెక్కులు కొనసాగుతుండగా అంతే మొత్తంలో ఐదు వరద గేట్ల ద్వారా సుద్దవాగులోకి నీటిని వదిలి వేస్తున్నారు. ఇక మహారాష్ట్రలో వానల జోరు అధికమైన నేపథ్యంలో గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి మరింత వరద నీటి చేరిక పెరిగే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇదే జరిగితే 5 వరద గేట్ల ద్వారా నీటి విడుదల ను పెంచే అవకాశాలు ఉన్నాయి.