Srikaram News
తెలంగాణ

జిల్లావ్యాప్తంగా దంచి కొట్టిన వానలు

– సగటు వర్షపాతం 63 మిల్లీమీటర్లుగా నమోదు
– అత్యధికంగా సారంగాపూర్ మండలంలో 130.2 మిల్లీమీటర్లు
– అత్యల్పంగా కడెం మండలంలో 27.4 మిల్లీమీటర్లు

బైంసా (శ్రీకరం న్యూస్ ): జిల్లాలో శనివారం వానలు దంచి కొట్టాయి. వేకువ జాము నుంచి ప్రారంభమైన వానల జోరు రాత్రి వరకు కొనసాగింది. సాయంత్రం వేళలో కాస్త తగ్గిన వరుణుడి జోరు రాత్రి సమయానికి మళ్లీ పెరిగింది. ఈ క్రమంలో జిల్లాలో ఆదివారం సగటు వర్షపాతం 63 మిల్లీమీటర్లు నమోదైంది. ఇక అత్యధికంగా సారంగాపూర్ మండలంలో 130.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా కడెం మండలంలో 27.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మిగతా మండలాలలో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కుబీర్ మండలంలో 82 మిల్లీమీటర్లు, తానూర్ మండలంలో 101.2 మిల్లీమీటర్లు, బాసర మండలంలో 47 మిల్లీమీటర్లు, ముధోల్ మండలంలో 64. 6 మీటర్లు, భైంసా మండలంలో 94 .8 మిల్లీమీటర్లు, కుంటాల మండలంలో 83.2 మిల్లీమీటర్లు, నర్సాపూర్ (జి) మండలంలో 43 .8 మిల్లీమీటర్లు, లోకేశ్వరం మండలంలో 80 మిల్లీమీటర్లు, దిలావర్పూర్ మండలంలో 79.2 మిల్లీమీటర్లు, నిర్మల్ అర్బన్ లో 59.2 మిల్లీమీటర్లు, నిర్మల్ రూరల్ లో 45.2 మిల్లీమీటర్లు, సోన్ మండలంలో 61.6 మిల్లీమీటర్లు, లక్ష్మణ్ చందా మండలంలో 28.6 మిల్లీమీటర్లు, మామడ మండలంలో 42.4 మిల్లీమీటర్లు, పెంబి మండలంలో 58.6 మిల్లీమీటర్లు, ఖానాపూర్ మండలంలో 32 మిల్లీమీటర్లు, దస్తురాబాద్ మండలంలో 34.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.

0Shares

Related posts

పాలజ్ కు ప్రారంభమైన వాహనాల రాకపోకలు

Srikaram News

బైంసా, ముథోల్ ఆత్మ కమిటీల ఖరారు

Srikaram News

గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి 20 వేల క్యూసెక్కులకు తగ్గిన ఇన్ ఫ్లో

Srikaram News

భైంసా మీదుగా పాలజ్ కు నిలిచిన రాకపోకలు

Srikaram News

నిండుకుండలా గడ్డన్న వాగు ప్రాజెక్ట్

Srikaram News

కళా ఉత్సవ్ లో నాట్య ప్రదర్శనతో దుమ్మురేపిన భైంసా విద్యార్థినిలు

Srikaram News

Leave a Comment