– 4500 క్యూసెక్కులకు తగ్గిన ఇన్ ఫ్లో
– వరద గేట్ల ద్వారా నీటి విడుదలను నిలిపివేసిన అధికారులు
భైంసా (శ్రీకరం న్యూస్) ; ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గిన నేపథ్యంలో గడ్డెన్న ప్రాజెక్టులోకి వరద నీటి చేరిక తగ్గుముఖం పట్టింది. ఉదయం వేళలో 13900 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ ఫ్లో 9.30 గంటల సమయానికి 4500 క్యూసెక్కులకు తగ్గిపోయింది. ఈ క్రమంలో ఉదయం వేళలో 5 వరద గేట్లను ఎత్తివేసి సుద్దవాగులోకి 13900 క్యూసెక్కుల నీటిని వదిలిన అధికారులు ఇన్ ఫ్లో 4వేలకు తగ్గడంతో 5 వరద గేట్లను ఒక్కోక్కటిగా మూసి వేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 4500 ఇన్ ఫ్లో కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.7 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం నీటి మట్టం 357.1 మీటర్లుగా ఉంది.