– పూర్తిస్థాయి నీటి మట్టం 358. 7 మీటర్లు
– ప్రస్తుత నీటిమట్టం 358.6 మీటర్లు
– ఒక వరద గేట్ ద్వారా 3300 క్యూసెక్కుల నీటి విడుదల
బైంసా (శ్రీకరం న్యూస్): మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా గడ్డేన్న వాగు ప్రాజెక్టులోకి వరద నీటి చేరిక కొనసాగుతోంది ప్రాజెక్టు వరదనీటి చేరికతో నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.7 మీటర్లు ఉండగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం ముందుగా 358.6 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయి సామర్థ్యానికి దాదాపుగా చేరుకోవడంతో సోమవారం ఉదయం ప్రాజెక్టు నిర్వాహణాధికారులు ఒక వరద గేటుని ఎత్తివేసి సుద్ధవాగులోకి 3300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వరద నీటి చేరిక పెరిగితే అందుకు అనుగుణంగా నీటి వదిలివేతను పెంచుతామని ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మహారాష్ట్రతో పాటు ప్రాజెక్టు ఎగువ భాగంలోని ప్రాంతాల్లో వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులోకి వరద నీరు చేరిక పెరిగే పరిస్థితులు నెలకొని ఉన్నాయి.