– 10 వేల క్యూసెక్కులకు పెరిగిన ఇన్ ఫ్లో
– మూడు గేట్ల ద్వారా 13 వేల క్యూసెక్కుల
భైంసా( శ్రీకరం న్యూస్) : ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గడ్డేన్న వాగు ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో అధికమవుతుంది. ఉదయం వేళలో 3300 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ ఫ్లో మధ్యాహ్నం 12. 20 గంటలకు వరకు క్రమక్రమంగా పెరుగుతూ 10 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఎగబాకింది. దీంతో పరిస్థితిని అంచనా వేసిన ప్రాజెక్ట్ అధికారులు మరో రెండు గేట్లను ఎత్తివేసి మొత్తం మూడు గేట్ల ద్వారా సుద్ద వాగులోకి ఔట్ ఫ్లో కింద 13000 క్యూసెక్కుల నీటిని వదిలిపెట్టారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.7 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 358.6 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1.83 టీఎంసీ లుగా ఉండగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1.772 టీఎంసీలుగా ఉన్నాయి. ఇన్ ఫ్లో కు అనుగుణంగా నీటి వదిలివేత చెపడుతామని ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు.