Srikaram News
తెలంగాణ

బ్రేకింగ్ న్యూస్.. మరో రెండు గడ్డేన్న ప్రాజెక్ట్ వరద గేట్ల ఎత్తివేత

– 10 వేల క్యూసెక్కులకు పెరిగిన ఇన్ ఫ్లో
– మూడు వరద గేట్ల ద్వారా 13 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో

భైంసా( శ్రీకరం న్యూస్) : ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గడ్డేన్న వాగు ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో అధికమవుతుంది. ఉదయం వేళలో 3300 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ ఫ్లో మధ్యాహ్నం 12. 20 గంటలకు వరకు క్రమక్రమంగా పెరుగుతూ 10వేల క్యూసెక్కులకు ఇన్ ఫ్లో ఎగబాకింది. దీంతో పరిస్థితిని అంచనా వేసిన ప్రాజెక్ట్ అధికారులు మరో రెండు గేట్లను ఎత్తివేసి మొత్తం మూడు వరద గేట్ల ద్వారా సుద్ద వాగులోకి 13000 క్యూసెక్కుల నీటిని వదిలిపెట్టారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.7 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 358.6 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1.83 టీఎంసీ లుగా ఉండగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1.772 టీఎంసీలుగా ఉన్నాయి. ఇన్ ఫ్లో కు అనుగుణంగా నీటి వదిలివేత చెపడుతామని ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు

.

0Shares

Related posts

ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జాతీయ రహదారిపై రాస్తారోకో

Srikaram News

రాజాసింగ్ మద్దతు పోస్టులతో హీటెక్కిన సోషల్ మీడియా

Srikaram News

కేటీఆర్ తో బైంసా ఏఎంసీ మాజీ చైర్మెన్ పిప్పెరవార్ కృష్ణ బేటి

Srikaram News

గడ్డేన్న వాగు ప్రాజెక్టులోకి మరింతగా పెరిగిన ఇన్ ఫ్లో

Srikaram News

పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో కోటీశ్వరులు

Srikaram News

రోడ్డు ప్రమాదంలో విఠాపూర్ వాసి దుర్మరణం

Srikaram News

Leave a Comment