– 13 వేల నుండి 16 వేలకు క్యూసెక్కులకు పెంపుదల
– 10 వేల నుంచి 8200 క్యూసెక్కులకు తగ్గిన ఇన్ ఫ్లో
బైంసా (శ్రీకరం న్యూస్) : గడ్డెన్న వాగు ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా ద్వారా అవుట్ ఫ్లో ఇంతకింతకి పెరుగుతూ పోతుంది. ఉదయం 8గంటలకు ఒక వరద గేటు ద్వారా సుద్ధవాగులోకి 3300 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగింది. మధ్యాహ్నం12 గంటల సమయంలో ఇన్ ఫ్లో 10 వేల క్యూసెక్కులకు పెరుగడముతో మరో రెండు వరద గేట్లను ఎత్తి మొత్తం మూడు వరద గేట్ల ద్వారా సుద్దవాగులోకి 13 వేల క్యూసెక్కుల వరద నీటిని వదిలి చెపట్టారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇన్ ఫ్లో తగ్గినప్పటికీ అవుట్ ఫ్లో మాత్రం 13 వేల నుంచి 16,060 క్యూసెక్కులకు పెంచారు. వరదనీటి వదిలివేతతో ఉదయం ప్రాజెక్టు నీటిమట్టం 358.6 మీటర్లు ఉండగా మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 0.1 మీటర్లు తగ్గి 358.5 కు చేరుకుంది. అధిక మొత్తంలో వరదనీటి వదిలివేతతో కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు నీటిమట్టం మరింతగా తగ్గే పరిస్థితులు నెలకొన్నాయి.