* జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వెల్లడి-
* ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచన
* అత్యవసరముంటే తప్ప బయటకు వెళ్లవద్దని సలహా
బైంసా, (శ్రీకరం న్యూస్) : జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వాతవరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రేపు (బుధవారం) విద్యాసంస్థలకు కలెక్టర్ అభిలాష అభినవ ఒక రోజు సెలవు ప్రకటించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అంతటా జలమయమై చిన పరిస్థితుల నెలకొన్న దృష్ట్యా విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందికర వాతరవణం నెలకొన్న కారణంగా సెలవు ప్రకటించినట్లుగా వెల్లడించారు. విద్యార్థుల రవాణా, ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసు కున్నట్లుగా తెలిపారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు బుధవారం ఒక రోజు సెలవు అమలులో ఉంటుందని వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండా లని సూచించారు. అత్యవరసమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 9100577132 సంప్రదించాలని పేర్కొన్నారు.