Srikaram News
క్రైమ్తెలంగాణ

పబ్జీ గేమ్ కు బానిసగా మారిన విద్యార్థి ఆత్మహత్య

– పాఠశాలకు వెళ్లడం మాని ఆటకే పరిమితం.
– ఆట మాన్పించేందుకు కుటంబీకులు ముమ్మర ప్రయత్నాలు
– మూడు రోజులుగా అట ఆడకుండా కట్టడి
– డిప్రెషన్ తో ఉరివేసుకొని విద్యార్ధి ఆత్మహత్య
– బైంసాలోని ఆనంద్ నగర్ లో ఘటన

భైంసా( శ్రీకరం న్యూస్ ) పబ్జీ గేమ్ కు బానిసగా మారిన విద్యార్థి ఒకరు ప్రాణం తీసుకున్న విషాదకర ఘటన బుధవారం నిర్మల్ జిల్లా బైంసా మున్సిపల్ కేంద్రం పరిధిలోని అనందనగర్ కాలనీలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని మౌళాలి ప్రాంతానికి చెందిన బేతి సంతోష్, సాయిప్రజ దంపతులు గత కొంత కాలంగా భైంసాలోని ఆనంద నగర్ కాలనీ పరిధిలో నివాసముంటూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు బేతి రిశేంద్ర హైదరాబాద్ లోని భాష్యం స్కూల్లో తొమ్మిదవ తరగతి పూర్తి చేసు కొని పదవ తరగతిలో చేరాల్సి ఉంది. అయితే బేతి రిశెంద్ర గత కొంత కాలంగా పబ్జి గేమ్ కు బానిసగా మారాడు. వేసవి కాలం నుంచి పబ్జి గేమ్ ఆట ఆడటానికే పరిమితమయ్యాడు. ఇదే క్రమంలో చదువుపై నిర్లక్ష్యం చేసి పదవ తరగతి కోసం పాఠశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాడు. తల్లితండ్రులు ఎన్ని విధాలుగా నచ్చ చెప్పిన చదువు పై ద్యాస పెట్టకుండా సమయమంతా పబ్జి ఆట ఆడటంలోనే గడిపేవాడు. పబ్జీ ఆటకు బానినగా మారిన కుమారుడిలో మార్పు తెచ్చి చదువుపై దృష్టి పెట్టి దిశగా తల్లితండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం కానరాలేదు. చివరి ప్రయత్నంగా గత రెండు మూడు రోజుల నుంచి కుమారుడికి కుటుంబీకులు పబ్జీ గేమ్ ఆడకుండా కట్టడి చేసినట్లుగా తెలిసింది. దీంతో డిప్రెషన్ కు లోనైన సదరు విద్యార్థి మనస్థపం, ఆవేశం చెంది బుధవారం సాయంత్రం వేళలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బైంసా పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని పోస్టుమార్గం నిమిత్తం ఇక్కడి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

0Shares

Related posts

తెలుగు భాషాభిమానులను అలరారించిన ఆష్టావధానం

Srikaram News

నేడు బైంసాలో శ్రీ బద్దిపోచమ్మ విగ్రహా ప్రతిష్టాపనోత్సవం

Srikaram News

శ్రీ గౌతమి హైస్కూల్లో అలరారించిన ముందస్తు సంక్రాంతి వేడుకలు

Srikaram News

ఉపాద్యాయుల సమస్యల పరిష్కారం పీఆర్టీయూతోనే సాధ్యం

Srikaram News

శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో కొలువుదీరిన అమ్మవారు

Srikaram News

బాసరలో గోదావరి ముంపు ప్రాంతాల్లో ఎస్పీ డా. జానకి షర్మిల పర్యటన

Srikaram News

Leave a Comment