– సహోద్యోగులతో విహారాయాత్రకు వెళ్లగా దుర్ఘటన
– ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతి
– మృతుడు ముధోల్ తరోడా గ్రామవాసి
భైంసా (శ్రీకరం న్యూస్) : నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని తరోడ గ్రామానికి చెందిన లక్ష్మీ ఈశ్వర్ ప్రసాద్ (26) అనే వైమానిక జవాన్ ఆగ్రాలోని దమ్మోహ వాటర్ ఫాల్ కు స్థానిక సహోద్యోగులతో వెళ్లారు. అక్కడే ప్రమాదవశాత్తుపడి మృతి చెందాడు. స్థానిక పోలీసులు వాటర్ ఫాల్ లో గాలించగా మృతదేహం బయటపడింది. ఈ విషయం తెలియడంతో తరోడా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దేశం కోసం వైమానిక దళంలో పనిచేసి ఇలా ప్రమాదవశాత్తు చనిపోవడం తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. మృతదేహాన్ని రప్పించడానికి గ్రామస్తులు, తరోడా మాజీ సర్పంచ్ ఎమ్మెల్యే రామరావ్ పటేల్ ను కలవడంతో ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్ తో ఫోన్ లో మాట్లాడారు. ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు. కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించి సత్వర ఏర్పాటు చర్యలు ప్రారంభించారు.